
నాలుగు ఇళ్లలో దొంగతనం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మండలంలోని రాంచంద్రంపేట, వెల్లుల్ల గ్రామాల్లోని నాలుగు ఇళ్లలో చోరీ జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రాంచంద్రంపేటకు చెందిన పుల్లూరి గంగమణి, అల్లిక గణేశ్.. వెల్లుల్లకు చెందిన పెండెం నరేందర్, బొడ్డు లింగాధర్ తమ ఇళ్లకు తాళం వేసి ఊరికి వెళ్లారు. మంగళవారం వచ్చి చూసే సరికి ఆయా ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉన్నాయి. గంగమణి ఇంట్లో బీరువాలో దాచిన రూ.10వేల నగదు, గణేశ్ ఇంట్లో రూ.4వేల నగదు, నరేందర్ ఇంట్లో రూ.10వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తించి వేర్వేరుగా పోలీసులకు సమాచారమందించారు. సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటన స్థలాలను పరిశీలించారు. అనంతరం క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌లతో పరిశీలించి వివరాలను నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.