విఠల విఠల | - | Sakshi
Sakshi News home page

విఠల విఠల

Jul 6 2025 6:38 AM | Updated on Jul 6 2025 6:38 AM

విఠల

విఠల విఠల

స్వామికి ఇంట్లోనే ఆలయం

మద్నూర్‌ మండల కేంద్రానికి చెందిన వట్నల్‌వార్‌ కృష్ణ, రుక్మిణీ దంపతులు పండరీపూర్‌ విఠలేశ్వరుని భక్తులు. ఏడాది క్రితం నూతన ఇంటిని నిర్మించుకున్న సమయంలో ఇంట్లో విఠలేశ్వరునికి గుడి కట్టించుకున్నారు. మూడు అడుగుల ఎత్తుతో ఉన్న విఠలేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లోని గుడిలో ప్రతిష్టించారు. నిత్యం స్వామివారికి వస్త్రాలంకరణసేవ, నైవేద్యం, అర్చనలు చేస్తారు. తొలి ఏకాదశి రోజున పె ద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. పండరిపూర్‌ ఆలయంలో కొనసాగే పూజావిధానా న్నే తన ఇంట్లోని ఆలయంలో పాటిస్తారు.

పాండురంగని దర్శనం కోసం

పండరీపూర్‌కు..

జిల్లా నుంచి ‘దిండి’ పాదయాత్ర

తొలిఏకాదశి రోజున దర్శనంతో పులకించనున్న భక్తులు

ఉత్తమ సొసైటీగా ఉత్తునూర్‌

సదాశివనగర్‌(ఎల్లారెడ్డి): మండలంలోని ఉ త్తునూర్‌ సొసైటీ ఉత్తమ సొసైటీగా ఎంపికై ంది. గత పది సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక రుణాలు రూ.3 కోట్ల 5 లక్షలు వసూలయ్యా యి. విండో చైర్మన్‌ కాట్మండి ప్రభాకర్‌రావు, సీఈవో నహీంను గ్రామస్తులు, రైతులు అభినందించారు. 2024–2025 ఆర్థిక సంవ్సరంలో కామారెడ్డి జిల్లాలో ఐదో స్థానంలో ఉన్న ట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విండో చైర్మన్‌ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ.. సొసైటీల ద్వారా రైతులు పొందిన రుణాలు సకాలంలో తిరిగి చెల్లించి రైతు సహకార సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాంచందర్‌రావు, నిట్టూరి వెంకట్‌ రావు, డీకే రావు, శి వాజీరావు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సాహిత్యం

ఎంతో గొప్పది

కామారెడ్డి అర్బన్‌ : కామారెడ్డి జిల్లా సాహి త్యం ఎంతో గొప్పదని, సాహితీవేత్తల కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మద్ది చంద్రకాంత్‌రెడ్డి అన్నారు. తె లంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అ ధ్యక్షుడు గఫూర్‌ శిక్షక్‌, ప్రతినిధులు శనివా రం చంద్రకాత్‌రెడ్డిని సన్మానించి తెరవే జిల్లా కవులు, రచయితల పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మ న్‌ మాట్లాడుతూ.. జిల్లా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు గ్రంథాలయాల్లో ప్ర త్యేక చోటు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు మంద పీ తాంబర్‌, బి నాగభూషణం, కాసర్ల రామ చంద్రం, కౌడి రవీందర్‌, తిరుపతిరావు, గా యని సంధ్య, బానోత్‌ సురేశ్‌, లక్కీ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

పట్టణ అభివృద్ధికి

సహకరించాలి

కామారెడ్డి టౌన్‌: పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చందర్‌నాయక్‌ అన్నారు. మున్సిపల్‌ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో శనివారం చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రజలు, వ్యాపారులు చెత్త ను రోడ్లపై, మురికి కాలువల్లో వేయకుండా చెత్తసేకరణ ఆటోలకు ఇవ్వాలని కోరారు. సకాలంలో ఆస్తి, కులాయి పన్ను చెల్లించాలన్నారు. శానిటేషన్‌, తాగునీరు, తదితర సమస్యలుంటే నేరుగా మున్సిపల్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ కమిషనర్‌ రాజేందర్‌రెడ్డి, శానిటరీ ఎస్సై ఫర్వేజ్‌, జవాన్‌లు ఉన్నారు.

దశాబ్దాలుగా వెళ్తున్న

భక్తులు ఎందరో..

అక్కడికి వెళ్లలేనివారు

జిల్లాలోని

బైరాపూర్‌

గుడికి..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో విఠలేశ్వరుడిని వేలాది కుటుంబాలు పూజిస్తాయి. వారంతా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున విఠలేశ్వరుడిని దర్శించుకుంటారు. మహారాష్ట్రలోని పండరీపూర్‌లో కొలువైన విఠలేశ్వరుడు, రుక్మిణీదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఉమ్మడి జిల్లాలోని మద్నూర్‌, జుక్కల్‌, డోంగ్లీ, పెద్ద కొడప్‌గల్‌, నిజాంసాగర్‌, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, గాంధారి, కోటగిరి, రుద్రూ ర్‌, వర్ని, పొతంగల్‌, బోధన్‌ తదితర మండలాల నుంచి ఏటా తొలి ఏకాదశికి పక్షం రోజుల ముందుగానే వేలాది మంది ‘దిండి’పేరుతో పాదయాత్రగా బయలుదేరి వెళ్తా రు. 320 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి దర్శనం చేసుకుంటారు. వేలాది మంది రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లి తొలి ఏకా దశి రోజు పండరీపూర్‌కు చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. దారి పొడవునా స్థానికులు ‘దిండి’గా వెళ్తున్న భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తారు. మరికొందరు వాహనాల్లో వెళ్తారు.

పండరీపూర్‌కు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు

హిప్పర్గ నుంచి పాదయాత్రగా బైరాపూర్‌ విఠలేశ్వర ఆలయానికి వెళ్తున్న భక్తులు

ఇరవై ఏళ్లుగా వెళ్తున్నా..

ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది పండరిపూర్‌ కు పాదయాత్రగా వె ళ్తున్నా. విఠలేశ్వరుని అనుగ్రహంతో శక్తి ఉన్నన్ని రోజులు ఏటా తొలి ఏకాదశికి చేరుకునేలా పాదయాత్రగా వెళ్లి వస్తూనే ఉంటా. వేలాది మంది మా ప్రాంతం వాళ్లు పండరిపూర్‌కు వస్తారు.

– కొనింటి విఠల్‌,

బిచ్కుంద

విఠలేశ్వరుడి అనుగ్రహంతోనే..

ప్రతి ఏడాది పండరిపూర్‌లోని విఠలేశ్వరుడిని దర్శించుకుంటా. కొన్నేళ్లుగా విఠలేశ్వర స్వామి వద్దకు వెళ్లి రావడం జరుగుతోంది. మాకు విఠలేశ్వరుడే అన్నీ. స్వామిని నమ్ముకున్నోళ్లకు ఏలోటు ఉండదు. అంతా స్వామిదయ. ఇరవై ఐదేళ్లుగా వెళ్తున్నా.

– సంగాయప్ప స్వామి, మద్నూర్‌

దైవచింతనలో ఉంటాం

విఠలేశ్వరుడిని నమ్ముకున్నం. నిత్యం దైవ చింతనలో ఉంటాం. పదిహేనేళ్లుగా క్రమం తప్పకుండా పండరిపూర్‌కు వెళ్లి దర్శనం చేసుకుని వస్తున్నాను. అంతా స్వామి నడిపిస్తున్నాడు. చేతనైనన్ని రోజులు వెళ్లి వస్తూనే ఉంటా.

– వెంకట్‌ మహారాజ్‌,

మద్నూర్‌

నాలుగు దశాబ్దాలుగా వెళ్తున్నా

నేను సుమారు 41 ఏళ్లుగా పండరిపూర్‌కు వెళ్తున్నాను. విఠలేశ్వరుడి అనుగ్రహంతో ఇప్పటికీ క్రమం తప్పకుండా వెళ్లి వస్తున్నాను. అంతా స్వామి దయ. ప్రతి ఏడాది వెళ్లి వస్తాను. నాతోపాటు మా ఊరి వాళ్లు చాలా మంది వస్తారు.

– దార్పల్‌ సాయిలు, బిచ్కుంద

న్యూస్‌రీల్‌

బైరాపూర్‌లో విఠలేశ్వరుడు

నస్రుల్లాబాద్‌ మండలం బైరాపూర్‌లో కొలువైన విఠలేశ్వరస్వామి ఆలయానికి కూడా తొలి ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు తరలివస్తారు. పండరిపూర్‌కు వెళ్లలేని వాళ్లంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనానికి వచ్చిన భక్తులకు స్థానిక ఆలయ నిర్వాహకులు అన్నదానం చేస్తారు. బైరాపూర్‌ ఆలయానికి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలి ఏకాదశి రోజున బైరాపూర్‌ ఆలయం జనంతో కిక్కిరిస్తోంది.

పుండరీకుడు తన తల్లిదండ్రులకు చేస్తున్న సేవను చూస్తూ ముగ్ధుడైన ఆ మహావిష్ణువు (పాండురంగడు) రెండు చేతులు నడుముకు పెట్టుకుని ఇటుకపై అలానే నిల్చుండిపోయాడు. విఠోబ..

విఠలేశ్వరుడు.. పాండురంగడు ఏ

పేరుతో పిలిచినా స్వామి పలుకుతాడని భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ప్రతి

ఏడాది భక్తులను పండరీపురానికి నడిపిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది

కూడా జిల్లా నుంచి భక్తులు పెద్ద

సంఖ్యలో ‘దిండి’గా తరలివెళ్లారు.

విఠల విఠల1
1/11

విఠల విఠల

విఠల విఠల2
2/11

విఠల విఠల

విఠల విఠల3
3/11

విఠల విఠల

విఠల విఠల4
4/11

విఠల విఠల

విఠల విఠల5
5/11

విఠల విఠల

విఠల విఠల6
6/11

విఠల విఠల

విఠల విఠల7
7/11

విఠల విఠల

విఠల విఠల8
8/11

విఠల విఠల

విఠల విఠల9
9/11

విఠల విఠల

విఠల విఠల10
10/11

విఠల విఠల

విఠల విఠల11
11/11

విఠల విఠల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement