
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న రోడ్డు రోలర్
నస్రుల్లాబాద్: మండలంలో కొద్దిరోజులుగా 765 డి జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో గురువారం దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై రోడ్డు రోలర్‌తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి వాహనంపై పడినా.. లేదా రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై పడిన ప్రాణాపాయం జరిగేదని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్తంభం విరిగినా కూడా తృటిలో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు కొత్త స్తంభం వేయించి సరిచేసి ఇస్తానని అధికారులు తెలపడంతో గ్రామానికి ప్రత్యమ్నాయం మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేశారు.
స్తంభం విరిగినా వైర్లు తెగకపోవడంతో తప్పిన ప్రమాదం