
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా ని ర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కామరెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్‌లో ఇద్దరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్‌లను అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిరుపేదలు సైతం గౌరవంగా సొంత ఇంటిలో నివసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్, హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.