విద్యార్థినికి అభినందన

- - Sakshi

కామారెడ్డి రూరల్‌: తమిళనాడులోని మధురైలో ఇటీవల జరిగిన హాకీ జూనియర్‌(మహిళా విభాగం) సౌత్‌ జోన్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న విద్యార్థిని టి.శ్రావ్యను కలెక్ట ర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. శ్రావ్య కుప్రియాల్‌లోని మహాత్మా జ్యోతీబా పూలే గురుకుల పాఠశాలలో చదువుతోంది. ఆమె బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలిసింది. కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు నీలం లింగం, జిల్లా విద్యాశాఖాధికారి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన దీక్ష

కామారెడ్డి టౌన్‌: టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ ఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకోవాల ని ఏబీవీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మనోజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌తో బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళా శాల వద్ద నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మనోజ్‌ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ కృష్ణ, నాయకులు శ్రీరాం, ప్రణీత్‌, రోహిత్‌, మోహన్‌, విష్ణు, గణేష్‌, సాగర్‌ తదితరులు పాల్గొన్నారు.

‘వంద శాతం పన్నులు వసూలు చేయాలి’

కామారెడ్డి టౌన్‌: కామారెడ్డి బల్దియాలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సూచించారు. బుధవా రం మున్సిపల్‌ కమిషనర్‌ చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొండి బకాయిలు ఉంటే చట్ట ప్రకారం యజమాను ల ఆస్తులను జప్తు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు 70 శాతం వరకు పన్నులు వసూలయ్యాయని అధికారులు వివరించా రు. స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి పన్నులు వసూలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, కమిషనర్‌ దేవేందర్‌ పాల్గొన్నారు.

భిక్కనూరు: ఇంటి పన్నులను వంద శాతం వసూలు చేయాలని డీపీవో శ్రీనివాస్‌ పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఆయన బుధవారం భిక్కనూరు ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించారు. పెద్దమల్లారెడ్డి, భాగిర్తిపల్లి గ్రామాలను సందర్శించి పల్లె ప్రగతిలో జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించారు. కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట డీఎల్‌పీవో సాయిబాబా, ఎంపీవో ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

‘అంబేడ్కర్‌ భవన పనులను వేగవంతం చేయండి’

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో రూ. 1.50 కోట్లతో చేపట్టిన అంబేడ్కర్‌ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. బుధవారం అంబేడ్కర్‌ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు. అనంతరం పట్టణంలోని కోనా బాన్సువాడ ఉన్నత పాఠశాలలో రూ.38 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను స్పీకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, గంగాధర్‌, ఎజాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Kamareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top