
హైదరాబాద్‌లో కానిస్టేబుల్ మృతి
పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహేందర్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లోని మీర్‌పేట పీఎస్ పరిధిలో స్కూటీపై వెళుతుండగా.. గుర్తుతెలియని కారు వేగంగా ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో కింద పడిన మహేందర్ తలకు బలమైన గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మహేందర్ స్వస్థలం లింగాలలో విషాదఛాయలు అములుకున్నాయి. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు.