పరీక్షల భయాన్ని వీడితేనే విజయం

విజేతలకు బహుమతులు అందజేస్తున్న జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత, శ్రీనాథచారి  - Sakshi

అయిజ: విద్యార్థులందరూ భయాన్ని వీడి పరీక్షలకు హాజరుకావాలని.. అప్పుడే విజయం సాధిస్తారని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, మోటివేషన్‌ స్పీకర్‌ డాక్టర్‌ శ్రీనాథచారి అన్నారు. జిల్లాలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పట్టణంలోని ఎంబీఆర్‌ ఫంక్షన్‌ హాల్లో సోమవారం పరీక్షలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆమె హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని, పరీక్ష సమయంలో విద్యార్థులు భయాందోళన లేకుండా చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్డర్‌ శ్రీనాథాచారి మాట్లాడుతూ.. పరీక్షలు పండుగల్లాంటివని, రైతుల శ్రమ ఫలితం సంక్రాంతి పండుగకు ధాన్యం రూపంలో ఇంటికి చేరుతుందో అదేవిధంగా విద్యార్థులు సంవత్సర కాలంలో పడిన శ్రమకు మెమో రూపంలో మార్కులనే ధాన్యం చేతికందుతుందని అన్నారు. పరీక్షలనే పండుగను ఆహ్వానించాలేగాని భయపడరాదని అన్నారు. సందర్భోచితమైన కథలు, ఉదాహరణలతో సాగిన ప్రసంగం విద్యార్థులను ఆకట్టుకుంది. అదేవిధంగా ఇటీవల వివిధ పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలైన వారికి ప్రశంసా ప్రతాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిన్న దేవన్న, ఇంచార్జ్‌ ఎంఈఓ నరసింహ, బీఆర్‌ఎస్‌ నాయకులు ఎక్లాస్‌పురం నరసింహారెడ్డి, వివిధ పాఠశాలల కరస్పాండెట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.

Read latest Jogulamba News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top