
ముగిసిన కోలాట శిక్షణ
జనగామ రూరల్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజా కళల పరిరక్షణలో భాగంగా నిర్వహించిన బోనాల కోలాట శిక్షణ శిబిరం ము గింపు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథి గా అరుణోదయ కల్చరల్ ఫెడరేషన్ చైర్మన్ విమల క్క హాజరై మాట్లాడుతూ.. ప్రజా కళలు జీవించాల ని ప్రజలను చైతన్యవంతం చేయడానికి కళాకారులు కృషి చేయాలన్నారు. 51 మంది శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు సర్టిఫికెట్లు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఒగ్గు బీర్ల కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఓగ్గు ధర్మయ్య, కనకంచి పాపయ్య తదితరులు పాల్గొన్నారు.