
ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్
జనగామ రూరల్: స్థానిక ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎప్‌సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసిందని కళాశాల ప్రిన్సిపాల్ రాత్ ఖానం అన్నారు. ఎప్‌సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 1,071 విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు తమకు నచ్చిన కాలేజీ కోసం వెబ్‌ఆప్షన్లు ఇవ్వవచ్చని, 18న మొదటి విడత అలాట్‌మెంట్ జరుగుతుందన్నారు.
అంతర్జాతీయ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించిన శ్రీయాన్‌రామ్
కొడకండ్ల: మండలకేంద్రానికి చెందిన శివరాత్రి శ్రావణ్‌కుమార్ – లలిత కుమారుడు శ్రీయాన్‌రామ్ అంతర్జాతీయ క్లాసికల్ చెస్ రేటింగ్ సాధించాడు. జూన్‌లో హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో జరిగిన అండర్ –9 చెస్ నేషనల్ టోర్నమెంట్‌లో శ్రీయాన్‌రామ్ ప్రతిభ కనబరిచి 1506 రేటింగ్ సాధించినట్లు కోచ్‌లు రాజు, పవన్ తెలిపారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే చెస్‌లో ప్రతిభను చాటుకొంటున్న శ్రీయాన్‌రామ్‌ను పలువురు అభినందించారు.
విద్యతోపాటు వినయాన్ని అలవర్చుకోవాలి
రఘునాథపల్లి: విద్యతోపాటు విద్యార్థులు వినయాన్ని అలవర్చుకోవాలని జిల్లా విద్యాధికారి భోజన్న సూచించారు. మండలంలోని వెల్ది మోడల్ స్కూల్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. పదో తరగతి గదిలో విద్యార్థుల పక్కనే కూర్చొని ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతోపాటు క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితంలో ఎదిగేందుకు ఎంతో దోహదపడుతుందన్నారు. అనంతరం స్కూల్ ఆవరణలో ప్రిన్సిపాల్ పాలకుర్తి శ్రీధర్‌తో కలిసి ఇంకుడు గుంత పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గణేష్ కందగట్ల, మల్లం శ్రీధర్, కట్ట రాజు, శ్రీను, జయశ్రీ, విజయ, శశికుమారి, పార్వతి, సౌజన్య, ప్రియ, పీఈటీలు రాజయ్య, వాసుదేవు తదితరులు పాల్గొన్నారు.
ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
బచ్చన్నపేట: లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వెంటనే ప్రారంభించాలని డీఎల్‌పీఓ వెంకట్‌రెడ్డి అన్నారు. కొడవటూరు రైతువేదికలో జసిరెడ్డిపల్లి, బండనాగారం, లక్ష్మాపూర్, బోనకొల్లూరు, కేసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన వారికి పలు సూచలను చేశారు. లబ్ధిదారులతో వెంటనే ఇళ్లను ప్రారంభింపజేయాలని, కొలతల్లో తేడా రాకుండా చూడాలన్నారు. నిర్మాణ దశలకు అనుగుణంగా లబ్ధిదారుల ఖాతాల్లో చెల్లింపులు జరుగుతాయన్నారు. ఆయన వెంట ఎంపీడీఓ వెంకట మల్లికార్జున్, హౌసింగ్ ఏఈ ఈశ్వర్, కార్యదర్శులు నర్సింహాచారి, బృంగి రూప, చైతన్య, భరత్, కిషోర్ పాల్గొన్నారు.

ముగిసిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్