
మున్సిపల్ అభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలి
● మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జేడీ శ్రీధర్
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి అధికారులు, సి బ్బంది ప్రత్యేక చొరవతో బాధ్యతగా పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. మున్సిపాలిటీ పరిసరాలు, కమిషనర్ గది, ఫైళ్లు, రిజిష్టర్లను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మా ట్లాడుతూ నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ అభివృద్ధికి అందరూ బాధ్యతగా పనిచేయాలన్నా రు. 100 రోజుల ప్రణాళిక పనులను సమర్ధవంతంగా చేపట్టాలని, విధి నిర్వహణలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. గతంలో గ్రామ పంచాయతీ, ప్రస్తుత మున్సిపాలిటీకి పనుల్లో చాలా వ్యత్యాసం ఉంటుందని, అందరూ పనుల్లో అప్‌గ్రేడ్ కావాలని, విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం మాజీ సీఎం రోశ య్య జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.