
దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలి
జనగామ రూరల్: దొడ్డి కొమురయ్య ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నా రు. సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ పోరాటంలో వెనుకబడిన తరగతుల కులాలకు అండగా నిలబడిన దొడ్డి కొమురయ్య మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెనుకబడిన తరగతుల కులాలకు ప్రాధాన్యతనిచ్చి వారి అభ్యున్నతికి కృషిచేస్తున్నదన్నారు. కార్యక్రమంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు కంచె రాములు, పట్టణ అధ్యక్షుడు బల్దే మల్లేశం, పట్టణ కార్యదర్శి జూకంటి శ్రీశైలం, కోశాధికారి ఎండ్రు వైకుంఠం, యాదవ సంఘం పట్టణ అధ్యక్షుడు కానుగంటి ముత్తయ్య, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల బాలరాజు, రజక సంఘం జిల్లా సెక్రటరీ పదునూరి మదార్, కల్లుగీత కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బల్దే వెంకట మల్లయ్య, కోపా అధ్యక్షుడు కర్రే కృష్ణ పాల్గొన్నారు.