భూగర్భ జలాలను పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలను పెంపొందించాలి

Jul 5 2025 6:30 AM | Updated on Jul 5 2025 6:30 AM

భూగర్భ జలాలను పెంపొందించాలి

భూగర్భ జలాలను పెంపొందించాలి

దేవరుప్పుల: మానవ జీవిత పురోగతికి నిరంతరం దోహదపడే విద్య, వైద్య రంగాల్లో విధులు నిర్వర్తించే అధికారులు నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించిన కలెక్టర్‌ భూరెవెన్యూ సదస్సుల ప్రక్రియ, రేషన్‌ కా ర్డుల జారీ తదితర విషయాలపై సమీక్షించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దినచర్య యాప్‌లో కాకుండా రికార్డులపరంగా సమాచారం లేకపోవడాన్ని గుర్తించి సత్వరమే పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశిస్తూ స్థానికుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అక్కడి నుంచి కొత్తకాలనీలో కస్తూర్బా బాలికల హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్‌ గంటసేపు పైగా తరగతి గదులు తిరిగి విద్యార్థినుల అభ్యున్నతిపై నిశితంగా ప్రశ్నిస్తూ పలు సందేహాలకు నివృత్తి చేశారు. ప్రతి కుటుంబ అభివృద్ధిలో విద్య కీలకమని, బాలికల అభ్యున్నతికి ప్రత్యేక తరగతులు నిర్వహించి ప్రోత్సహించాలని ఎంఇఓ కళావతికి సూచించారు. పాఠశాలలు ప్రారంభమై నెలదాటినా బాలికలకు యూనిఫామ్‌ అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని ఐకేపీ ఏపీఎం వెంకట్‌రెడ్డిని ఆదేశించారు. నిర్దేశిత 360 మందికి 310 విద్యార్థినులు ఉండడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన సిబ్బంది కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని ప్రత్యేకాధికారి సుకన్యకు సూచించా రు. ఇదిలా ఉండగా.. కామారెడ్డిగూడెం రైతులు తమ వాగు నుంచి ఇసుక తరలించొద్దని కలెక్టర్‌ను కోరగా.. వారం తర్వాత ఇసుక తరలింపు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

భూగర్భ జలాలను పెంపొందించాలి

జనగామ రూరల్‌: ప్రతీ నీటిబొట్టును ఒడిసిపట్టి భవిష్యత్‌లో తాగు, సాగు నీటి కొరత ఉండకుండా భూగర్భ జలాలను పెంపొందించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు. మన జిల్లా –మననీరు కార్యక్రమంలో భాగంగా తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణం ప్రగతి పైన శుక్రవారం సాయంత్రం క్యాంప్‌ కార్యాలయం నుంచి గూగుల్‌ మీట్‌ ద్వారా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా మాట్లాడుతూ.. ప్రతి గ్రామ, మండల, జిల్లా కార్యాలయంలో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించాలని తెలిపారు. తాగు, సాగు నీరుకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే భూగర్భ జలాలను సంరక్షించుకోవడం తప్పనిసరి అని వివరించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంత నిర్మించుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతి రోజు సాధించిన ప్రగతిని సోక్‌ పిట్‌ ఫొటోలను గూగుల్‌ షీట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశిస్తూ సాధ్యమైనన్ని సోక్‌ పిట్‌ నిర్మాణాలు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని చెపారు. వన మహోత్సవంపై గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించడం ద్వారా అవగాహన కల్పించాలన్నారు.

విద్య, వైద్య రంగాల్లో నిర్లక్ష్యం తగదు

కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement