
సోమేశ్వరాలయానికి వెండి కలశాల బహూకరణ
పాలకుర్తి టౌన్: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయానికి రెండు వెండి కలశా లను (చెంబులు) భక్తులు శనివారం బహూక రించినట్లు ఈఓ సల్వాది మోహన్‌బాబు తెలిపారు. స్వామి వారి పూజా కార్యక్రమాల్లో వినియోగించేందుకు వరంగల్‌కు చెందిన భ క్తుడు అనంతుల రవి కుమార్, స్వప్న కుటుంబ సభ్యులు రూ.1,35,000 విలువైన 1.34 కేజీల వెండి కలశాలు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, అర్చకులు దేవగిరి లక్ష్మ న్న, డీవీఆర్ శర్మ, దేవగిరి అనిల్‌కుమార్, మత్తగజం నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
మధ్యవర్తిత్వ కేంద్రాలతో
సమస్యల పరిష్కారం●
జనగామ రూరల్: మధ్యవర్తిత్వ కేంద్రాలతో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని సీనియర్ సివిల్ జడ్జి సి. విక్రమ్ అన్నారు. శని వారం ప్రధాన న్యాయమూర్తి బి ప్రతిమ ఆదేశాల మేరకు పట్టణంలోని కురుమవాడలో జనహిత కౌండిన్య మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతీ చిన్న సమస్యకు పోలీస్‌స్టేషన్, కో ర్టుకు వెళ్లడం సరికాదని, మధ్యవర్తిత్వ కేంద్రాల్లో పరిష్కరించుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ దామోదర్ రెడ్డి, మధ్యవర్తి మేకపోతుల ఆంజనేయులు పాల్గొన్నారు.
ఉప్పల్ డీలక్స్ బస్సు
సర్వీసులకు రిజర్వేషన్
జనగామ: జనగామ డిపో నుంచి ఉదయం 6.20 (8552) బస్సు నంబర్), 7.10 (8554) గంటలకు ఉప్పల్‌కు వెళ్లే డీలక్స్ బస్సు సర్వీసులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు డిపో మేనేజర్ ఎస్.స్వాతి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ ఉప్పల్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇంటి నుంచే టీజీఎస్‌ఆర్టీసీబస్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చన్నారు.
తిరంగా యాత్రను
విజయవంతం చేయాలి
జనగామ రూరల్: ఆర్మీ జవాన్లకు సంఘీభావంగా నిర్వహిస్తున్న తిరంగా యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ అన్నారు. శనివారం పట్టణంలో తిరంగా యాత్ర కమిటీ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషప్ సిందూర్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు గాను నేడు (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు నిర్వహించే తిరంగా యాత్రను విజయవంతం చేయాలని కోరారు.
బెస్ట్ అవైలబుల్ స్కీంకు
దరఖాస్తు చేసుకోవాలి
జనగామ రూరల్: ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు 2025–26 విద్యాసంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా 1వ, 5వ తరగతిలో ప్రవేశాలు కల్పించేందుకు జిల్లాకు చెందిన ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ సంక్షేమ అధికారి డాక్టర్ విక్రమ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో మౌలిక వసతులు, 7, 10వ తరగతిలో 90శాతం పైగా ఉత్తీర్ణత కలి గి ఉండాలన్నారు. ఆసక్తిగల ఇంగ్లిష్ మీడి యం పాఠశాలల యాజమాన్యాలు ఈ నెల 19 వ తేదీలోగా కలెక్టరేట్‌లోని ఎస్సీ సంక్షేమ కా ర్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.
సబ్సిడీపై జీలుగ విత్తనాలు
జనగామ రూరల్: ప్రభుత్వ సహకార సంఘాలు, ఆగ్రో రైతు సేవా కేంద్రాల్లో జీలుగు విత్తనాలు సబ్సిడీతో అందుబాటులో ఉన్నాయని క లెక్టర్ రిజ్వాన్ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 కిలోల బస్తా పూర్తి ధర రూ.4,275కి గాను 50శాతం సబ్సిడీ పోను రూ.2,137.5లకు రైతులకు అందిస్తున్నామన్నారు. విత్తనాలు కావాల్సిన రైతులు ఆధార్, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్‌తో సంబంధిత ఏఈఓలను సంప్రదించాలన్నారు. జిలుగ సాగుతో భూమిలో సారవంతం పెరిగి వచ్చే వర్షాకాలంలో పంట దిగుబడి పెరిగేందుకు దోహదపడుతుందన్నారు.

సోమేశ్వరాలయానికి వెండి కలశాల బహూకరణ