
తహసీల్ ఎదుట 10 గంటల ధర్నా
జనగామ: పట్టణంలో బాణాపురం మూడో విడతలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాల యం ఎదుట సీపీఎం ఆధ్వర్యాన లబ్ధిదారులు గురువారం 10 గంటల పాటు ఆందోళన చేపట్టా రు. పట్టణ కార్యదర్శి జోగు ప్రకాశ్ అధ్యక్షతన ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు బైఠాయించారు. ఇంటి నంబర్లు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాలనీలో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడు తూ ఏడాది కాలంగా ఇంటి నంబర్లకు ఆదేశాలు ఇవ్వకుండా మున్సిపల్ కమిషనర్ కాలయాపన చేస్తూ నిరుపేదల జీవితాలతో చెలగాటమాడుతున్నాడని అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అర్బన్ డబుల్ బెడ్రూం పథకంలో జీప్లస్ టూ పద్ధతిన 144 నిళ్ల నిర్మాణం మొదలు పెట్టడంతోపాటు 2003 ఆగస్టులో అదే భూమిని అండర్ టేకింగ్ చేసుకున్నట్లు పురపాలిక అధికారులు చెప్పారని తెలిపారు. ఆర్డీఓ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ప్లాట్లు కేటాయించి ఇప్పుడు తమ పరిధి కాదనడం సబబుకాదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు వేసి, కనీస సదుపాయాలు కల్పించే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు. రాత్రి 7 గంటలకు కమిషనర్ వెంకటేశ్వర్లు వచ్చి వారితో మాట్లాడడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో నాయకులు రాపర్తి రాజు, ఉపేందర్, అజహరొద్దీన్, భూక్య చందునా యక్, బిట్ల గణేష్, కల్యాణం లింగం, పాముకుంట్ల చందు, పగిడిపల్లి బాలమణి పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని లబ్ధిదారుల డిమాండ్