
శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులు
వల్మిడి గుట్టపై చలువ పందిళ్లు.. (ఇన్‌సెట్‌లో)
● నేడు శ్రీరామనవమి ● వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
● వల్మిడిలో రాములోరి కల్యాణ బ్రహ్మోత్సవాలు
శ్రీరామనవమిని పురస్కరించుకొని గురువారం సీతారాముల కల్యాణం, పట్టాభిషేకం కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో నిర్వహించనున్నారు. ఈ వేడుకను భక్తులు తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఎండలు పెరిగిన నేపథ్యంలో చలువ పందిళ్లు వేశారు. పాలకుర్తి మండలం వల్మిడిలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం(గుట్టపై)లో ఈనెల 30 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు దంపతులు హాజరవుతున్నారు. కల్యాణ క్రతువును వీక్షించేందుకు వచ్చే భక్తులకు భోజన సదుపాయం, అలాగే గుట్టపైకి తరలించడానికి వాహనాలు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం పాతబీటు బజారులో శ్రీ సీతారామచంద్రస్వామి కమిటీ ఆధ్వర్యంలో 70వ ఏట కల్యాణం నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. అలాగే జనగామ పట్టణంతోపాటు పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల పరిధి ఆలయాల్లో వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
– జనగామ
– వివరాలు 11లోu
