
మున్సిపల్ ఎదుట ధర్నా చేస్తున్న కాలనీవాసులు
● జీఎంఆర్‌కాలనీ వాసుల ధర్నా
జనగామ: రూ.లక్షలు పెట్లి ఇళ్లు కట్టుకున్నాం.. కాలనీ రోడ్డును కబ్జా చేశారు.. దారిలేక నరకం చూస్తున్నాం.. అధికారులు పట్టించుకోవడం లేదంటూ జీఎంఆర్‌కాలనీ వాసులు బుధవారం మున్సిపాలిటీ ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వీఆర్‌ఎన్.రెడ్డి, కార్యదర్శి బి.రఘు, కోశాధికారి షర్ఫొద్దీన్, రామచంద్రం, మండి శ్రీనివాస్‌రెడ్డి, ఉప్పలయ్య, నరేష్, అనిల్‌రెడ్డి, మురళి, నర్సింహులు, హరిప్రసాద్ మాట్లాడుతూ ఆరేళ్ల క్రితం 60 కుటుంబాలు ప్లాట్లు కొనుగోలు చేసి అన్ని అనుమతులతో ఇళ్లు నిర్మిచుకున్నామని చెప్పారు. పలువురు కాలనీకి వచ్చే 50 ఫీట్ల రోడ్డును కబ్జా చేయడంతో ఇరుకుగా ఉన్న 9 ఫీట్ల రోడ్డు వెంట వెళ్లాల్సి వస్తున్నదని అన్నారు. కబ్జాకు గురైన రోడ్డును అప్పగించకపోతే కుటుంబాలతో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.