చెవుల్లో కూడా కరోనా వైరస్‌

Scientists discover coronavirus in the EARS of two dead Covid positive patients  - Sakshi

ముక్కు, గొంతే కాదు.. చెవుల ద్వారా కూడా కరోనా!

కరోనా మృతుల చెవిభాగాల్లో వైరస్‌ ఉనికి

కరోనా సోకిందనడానికి వినికిడి లోపం కూడా ఒక లక్షణం కావచ్చు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కట్టడికి  వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు  ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రయత్నాలు శరవేగంగా కొనసాగుతున్న తరుణంలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. చెవుల ద్వారా కూడా కరోనా వ్యాపిస్తుందనే అంచనాలను తాజాగా పరిశోధకులు తమ అధ్యయనంలో కనుగొన్నారు. చెవి వెనుక ఉన్న పుర్రె, చెవిలోని మాస్టాయిడ్ ఎముకకు కూడా ఈ వైరస్ సోకుతుందని కొత్త పరిశోధన తేల్చింది. కోవిడ్‌​-19 తో మరణించిన రోగులపై హెడ్‌ అండ్‌ నెక్‌ శస్త్రచికిత్స విభాగం నిర్వహించిన ఈ అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనాయి. (కరోనా  అంతం సాధ్యం కాదు!)

జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ముగ్గురుపై చేసిన ఒక చిన్న అధ్యయనంలో, ఇద్దరికి మధ్య చెవుల్లోనే కాకుండా వెనుక చెవిలో కూడా అధిక వైరల్ లోడ్లు ఉ‍న‍్నట్టు గుర్తించారు. కరోనాతో చికిత్స పొంతుదున్న రోగుల మరణానికి ముందు వారి నమూనాలను సేకరించి ఈ పరిశోధన నిర్వహించినట్టు వెల్లడించారు.ఇప్పటి వరకు ముక్కు, గొంతు, ద్వారా ఊపిరితిత్తులలోకి పాకుతుందని అందరికీ తెలుసు. చెవిలోని ప్రధాన భాగమైన మస్టాయిడ్ (కర‍్ణభేరి) ప్రాంతంలో వైరస్‌ను తాజాగా గుర్తించారు. 

80 ఏళ్ల మహిళకు కుడి మధ్య చెవిలో మాత్రమే వైరస్ రాగా, 60 ఏళ్ల వ్యక్తికి ఎడమ, కుడి కర్ణబేరిలోనూ, ఎడమ,కుడి మధ్య చెవులలో వైరస్‌ను గుర్తించామని తెలిపారు. అయితే కరోనా అత్యంత తీవ్రంగా ఉండేవారికి మాత్రమే చెవుల్లోకి ప్రవేశిస్తుందా లేదంటే బయట నుంచి చెవుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందా అనేదానిపై స్పష్టత లేదని,  దీనిపై మరిన్నిపరిశోధనలు అవసరమని వీరు భావిస్తున్నారు. చెవుల స్వాబ్‌ను కూడా పరిశీలించాలని ఈ అధ్యయన బృందం సర్జన్లను హెచ్చరించింది. అలాగే సకింగ్ ట్యూబ్స్‌ ద్వారా మధ్య చెవి స్వాబ్‌ సేకరించే సమయంలో సర్జన్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. హెన్రీ ఫోర్డ్‌లోని ఓటోలారింగాలజీలో ఈ స్టడీ ప్రచురితమైంది. కరోనా వైరస్ చెవి ఇన్ఫెక్షన్లు లేదా చెవి సమస్యలతో ముడిపడి ఉందని వెల్లడి కావడం ఇదే మొదటిసారి కాదు. ఏప్రిల్,  2020 నాటి  ఒక అధ్యయనంలో కరోనా రోగుల్లో చెవిపోటు, వినికిడి లోపం లాంటి లక్షణాలను కనుగొన్నారు. అంతకుముందు వినికిడి సమస్యల చరిత్ర లేకపోయినా, కరోనా సోకిన తరువాత  ఈ సామర్ధ్యం  క్షీణించినట్టు మరో అధ్యయనంలో కనుగొన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top