వ్యాక్సిన్‌ తీసుకున్నాక కరోనా బారిన పడ్డ పాక్‌ ప్రధాని‌‌ | Pakistan PM Imran Khan Tests Positve Corona Virus | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ తీసుకున్నాక కరోనా బారిన పడ్డ పాక్‌ ప్రధాని‌

Mar 20 2021 4:01 PM | Updated on Mar 20 2021 4:16 PM

Pakistan PM Imran Khan Tests Positve Corona Virus - Sakshi

మహమ్మారి కరోనా వైరస్‌ రెండోసారి విజృంభిస్తోంది. తాజాగా పాక్‌ ప్రధానమంత్రికి కరోనా పాజిటివ్‌ తేలింది.

ఇస్లామాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ రెండోసారి విజృంభిస్తోంది. ప్రపంచదేశాలతో పాటు పాకిస్తాన్‌లోనూ కోరలు చాస్తోంది. తాజాగా పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు కరోనా పాజిటివ్‌ తేలింది. అయితే వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత పాజిటివ్‌ రావడం విస్మయం కలిగిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కలకలం రేపుతోంది. ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా చేసుకున్న పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్‌ వైద్య శాఖ మంత్రి ఫైజల్‌ సుల్తాన్‌ ప్రకటించారు.

ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని సుల్తాన్‌ తెలిపారు.అయితే కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్‌ రేపడం ఆందోళన కలిగిస్తోంది.  అయితే చైనాకు సంబంధించిన వ్యాక్సిన్‌ ‘సినోవక్‌’ వ్యాక్సిన్‌ తొలి డోసు ఇమ్రాన్‌ఖాన్‌ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్‌ పొందాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. అయితే పాకిస్తాన్‌ ప్రధానికి పాజిటివ్‌ రావడం.. చైనా వ్యాక్సిన్‌ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్‌ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్‌ కూడా నాసిరకం అని కామెంట్స్‌ చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement