యుద్ధాన్ని ఆపమని పుతిన్‌కి చెప్పగలిగేది చైనా మాత్రమే!

Chinese President Xi  Put Off Direct Engagement With Zelensky  - Sakshi

Beijing had "smooth communications" on Ukraine issue: రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చైనా అధ్యక్షుడు యుద్ధాన్ని నివారించే దిశగా సుమారు ఎనిమిది మంది దేశాధినేతలతో చర్చించారు. పైగా రష్యాను చర్చల దిశగా సమస్యలను పరిష్కరించుకోమని ప్రోత్సహించారు కూడా. కానీ ఇంతవరకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌ స్కీతో నేరుగా మాత్రం మాట్లాడలేదు. అంతేకాదు ఈ విషయమే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖను  స్థానిక మీడియ ప్రశ్నించింది. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్ రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం చాలా సున్నితమైన అంశం అని అందువల్లే మాట్లాడలేదని సమర్థించుకుంది.

పైగా తాము భద్రతకు సంబంధించిన అవిభాజ్యతను దృష్టిలో ఉంచుకుని చైనా అన్ని పార్టీలకు మద్దతు ఇస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 4న రష్యా నాయకుడితో "నో లిమిట్స్" భాగస్వామ్యాన్ని ప్రకటించిన వెంటనే పుతిన్ యుద్ధకాల ప్రత్యర్థితో మాట్లాడటానికి జిన్‌పింగ్‌ అయిష్టంగా ఉండవచ్చు అని నిపుణులు అంటున్నారు.  దాదాపు ఏడు దేశాల నాయకులతో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు సంభాషించారు. అంతేకాదు ఆయన కనీపం 10 జాతీయ శాసనసభలను ఉద్దేశించి ప్రసంగించారు కూడా. రష్యా ఉక్రెయిన్‌లతో  చైనాకు గల మంచి సంబంధాలే శాంతి చర్చలు దోహదపడుతుందని చైనాలో యూఎస్‌ రాయబారి పేర్కొనడం విశేషం. కానీ టర్కీకి చెందిన రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, జర్మనీకి చెందిన ఓలాఫ్ స్కోల్జ్, ఇజ్రాయెల్‌కు చెందిన నఫ్తాలి బెన్నెట్ వంటి నాయకులు ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడటమే కాక చర్చల దిశగా సమస్యను పరిష్కరించుకునేలా ప్రోత్సహించాయి కూడా.

పుతిన్ పాలన పతనం  కాకుండా పాశ్చాత్య అనుకూల ప్రభుత్వ ఆవిర్భావాన్ని  నివారించేలా ఈ వివాదాన్ని గౌరవప్రదంగా ముగించేలా ప్రయత్నించమని చైనా మాత్రమే రష్యాకు సలహా ఇవ్వలగలదు అని అంతర్జాతీయ భద్రతలోని నేషనల్ తైవాన్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ చెన్ షిహ్-మిన్ చెప్పడం గమనార్హం. అయితే చైనా చర్చలు దిశగా పరిష్కరించుకోవాంటూనే..రష్యాకు మద్ధతు ఇస్తుంది. పైగా ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న నిరవధిక దాడిని ఖండించ లేదు. ఉక్రెయిన్ సార్వభౌమాధికార హక్కును గౌరవిస్తున్నా అని అంటూనే.. మాస్కో తన సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం పిలుపునిచ్చిన ఆదేశానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. పుతిన్ పాలనను ఒంటరిగా చేయడానికి యూఎస్‌ నేతృత్వంలోని ఆంక్షల ప్రచారంలో చేరడానికి కూడా చైనా నిరాకరించింది.

అయితే అమెరికా వంటి అగ్రదేశాలు ఉక్రెయిన్‌ పెద్ద మొత్తంలో మానవతా సాయం అందిస్తే చైనా చాలా నామమాత్రపు సాయం అందించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వీడియో ప్రసంగాల ద్వారా ప్రపంచ దేశాల నాయకులను ప్రభావితం చేయడం వారి సాయం తీసుకోవడం వంటివి చేశారు. జర్మనీ వంటి కొన్ని దేశాల ఉదాసీనతతో వ్యవహరించడాన్ని ఖండించడమే కాకుండా విమర్శించడం వంటివి జెలెన్‌ స్కీ చేశారు. జెలెన్‌స్కీ ఈ విధంగా దేశాలన్నింటిని యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నాడనో మరే ఏ ఉద్దేశంతోనే తెలియదు గానీ చైనా అధ్యక్షుడు ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో మాట్లేడేందుకు విముఖత చూపిస్తున్నాడు.

(చదవండి: జీ20కి ఆల్రెడీ ఆహ్వానం.. ‘పుతిన్‌ పక్కన కూర్చోవడం నా వల్ల కాదు మరి!’)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top