
బీజింగ్ : చైనాకు చెందిన టిక్‌టాక్ తోపాటు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వీచాట్ నిషేధం తప్పదంటున్న అమెరికాపై చైనా ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. అమెరికా తమ దేశానికి చెందిన వీ చాట్‌ను బ్యాన్ చేస్తే.. అమెరికాకు చెందిన ఆపిల్ ఉత్తులను కూడా బాయ్ కాట్ చేస్తామంటూ హెచ్చరిస్తోంది. ఈ మేరకు జాచైనా విదేశీ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్ ట్వీట్ చేశారు.
వీచాట్‌ను బ్యాన్ చేస్తే చైనీయులు చేసే ఐఫోన్లు, ఇతర ఉత్పత్తుల వాడకాన్ని చైనా వాసులు నిలిపివేస్తారని, వారు కూడా నిషేధిస్తారని వెల్లడించారు. చైనాకు చెందిన వీ చాట్ యాప్‌ను నిషేధించాక అమెరికాకు చెందిన ఆపిల్ ఐఫోన్లను, ఇతర ప్రొడక్ట్స్‌ను చైనా వాసులు వాడడంలో అర్థం లేదన్నారు. మరోవైపు దీనిపై చైనాకు చెందిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందించడం విశేషం. ఆపిల్ ఫోన్ ను ఉపయోగిస్తాను, దేశాన్ని కూడా ప్రేమిస్తున్నాను అని వీబో ప్లాట్‌ఫామ్ వినియోగదారుడు ఒకరువ్యాఖ్యానించారు. ఇది సంఘర్షణ కాదు అని పేర్కొన్నారు. ఆపిల్ ఎంత మంచిదైనానో మేటర్...తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఆధునిక చైనా ప్రజలు వీచాట్‌ను విడిచిపెడితే ఆత్మను కోల్పోయినట్టే..ముఖ్యంగా వ్యాపారవేత్తలు అని వాదించారు. అయితే చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యలపై అమెరికా కానీ, అటు ఆపిల్ కంపెనీ గానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.(టిక్‌టాక్ : రేసులో మరో దిగ్గజం)
కాగా చైనాకు చెందిన వీచాట్ యాప్‌లో ప్రస్తుతం1.2 బిలియన్ల మంది వినియోగదారులున్నారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ప్రకారం చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 2020 రెండో త్రైమాసిక గణాంకాల ప్రకారం ఆపిల్ వాటా 8 శాతం మాత్రమే..చైనాలో హువావే అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టిక్ టాక్, వీచాట్ ను బ్యాన్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. నిర్దేశిత గడువులోగా ఆయా కంపెనీలు తమ అమెరికా బిజినెస్‌ను ఇతర ఏదైనా అమెరికన్ కంపెనీకి విక్రయించాలంటూ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను కూడా విడుదల చేశారు. దీనిపై తాజాగా చైనా విదేశాంగ శాఖ స్పందించింది.
If WeChat is banned, then there will be no reason why Chinese shall keep iPhone and apple products. pic.twitter.com/qkKuMNQ87f
— Lijian Zhao 赵立坚 (@zlj517) August 27, 2020