పూర్తికాలే! | - | Sakshi
Sakshi News home page

పూర్తికాలే!

Dec 4 2025 7:01 AM | Updated on Dec 4 2025 7:01 AM

పూర్త

పూర్తికాలే!

పూర్తికాలే! పుష్కరం దాటినా – 8లోu

న్యూస్‌రీల్‌

గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
పుష్కరం దాటినా
పిల్లర్లకే పరిమితమైన వరంగల్‌ కళాభవనం

వాహనాల పార్కింగ్‌ స్టాండ్‌గా మారిన కళాభవనం ప్రాంగణ స్థలం

వరంగల్‌: కళాకారులను ప్రోత్సహించేందుకు వరంగల్‌లో నిర్మించతలపెట్టిన కళాభవనం పిల్లర్లకే పరిమితమైంది. పుష్కర కాలం పూర్తయినా పనులు పూర్తికావడం లేదని కళాకారులు ఆందోళన చెందుతున్నారు. కాకతీయుల రాజధాని వరంగల్‌లో కళాభవనం (మినీ రవీంద్రభారతి) నిర్మించాలని కోరుతూ కళాకారులు గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. వీరి అభ్యర్థన మేరకు బహుళ సాంస్కృతిక కళాభవనం నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. కాగా, వరంగల్‌ పోచమ్మమైదాన్‌ సమీపంలో మల్టీపర్సస్‌ కల్చరల్‌ కాంప్లెక్స్‌ పేరిట నిర్మాణానికి రెండుసార్లు శంకుస్థాపన చేశారు. అప్పటి మంత్రిగా ఉన్న బస్వరాజు సారయ్య ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. 24–05–2013లో రూ.నాలుగు కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఏడాదిలో నిర్మించాలన్న నిబంధనలతో టెండర్లు నిర్వహించగా హైదరాబాద్‌కు చెందిన శ్రీకో ప్రాజెక్టు నిర్మాణ సంస్థ పనులు దక్కించుకుంది. మొదటి విడత పర్యాటకశాఖ మంజూరు చేసిన కోటి రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. బెస్మెంట్‌, పిల్లర్లు, జనరేటర్‌ రూం నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.69.88 లక్షలు చెల్లించారు. నిధులు విడుదలైతేనే మిగిలిన పనులు చేస్తామని కాంట్రాక్టర్‌ భీష్మించుకున్నాడు. 12 ఏళ్ల క్రితం ప్రారంభమైన కళాభవనం బేస్మెంట్‌తో అగిపోయింది. నిర్మాణం కోసం తీసుకొచ్చిన సిమెంట్‌ గడ్డ కట్టగా, ఇనుము తుప్పు పట్టిపోయింది. స్థలం టాక్సీ స్టాండ్‌ అడ్డాగా మారింది. తూర్పు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతో అసంపూర్తి పిల్లర్లు ఆకాశాన్ని చూస్తున్నాయి. హనుమకొండలో రూ.12 కోట్లతో చేపట్టిన కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ వ్యయం పెరిగింది. వరంగల్‌ పశ్చిమ ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సుమారు రూ.100 కోట్ల నిధులు మంజూ రు చేయించి పూర్తి చేశారు. కేవలం రూ.నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టిన కళాభవనానికి నిధులు తేవడంలో తూర్పు ప్రజాప్రతినిధులు విఫలమయ్యారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కలగానే హరిత హోటల్‌..

కళాభవనం కోసం కేటాయించిన స్థలంలో హరిత హోటల్‌ నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే నరేందర్‌ సూచనల మేరకు అప్పటి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ స్థలాన్ని పరిశీలించారు. డిజైన్‌లో మార్పులు చేసి కళాభవన్‌ నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేని వరంగల్‌ నగర ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కళాభవనంపై దృష్టి సారించాలి..

ఆర్ట్స్‌ కాలేజీ, నేరెళ్ల వేణుమాధవ్‌ ఆడిటోరియం, పోతన ఆడిటోరియం, కాశోజీ కళారక్షేతం హనుమకొండ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. వరంగల్‌ జిల్లా కేంద్రంలో ఆడిటోరియాలు లేవు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైనందున గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సైతం కాంగ్రెస్‌లో ఉన్నందన కళాభవనం (ఆడిటోరియం) నిర్మాణంపై దృష్టి పెట్టాలని నగరవాసులు, కళాకారులు కోరుతున్నారు.

నిధులు లేక పనులు ఆపేసిన కాంట్రాక్టర్‌

పార్కింగ్‌ స్టాండ్‌గా మారిన స్థలం

పట్టించుకోని తూర్పు ప్రజాప్రతినిధులు

కళాభవనం పూర్తిచేయాలి..

నృత్యంలో శిక్షణ తీసుకున్నప్పటికి పోటీల్లో పాల్గొనేందుకు ప్రాక్టీస్‌ చేసేందుకు వరంగల్‌లో కళాభవనం లేక ఇబ్బందులు పడుతున్నాం. నేరుగా పోటీలకు వెళ్లడం వల్ల అనుకున్న ఫలితాలు రావడం లేదు. స్థానిక కళాకారుల కోసం కళాభవనం వెంటనే పూర్తి చేయాలి.

– ఇప్పకాయల శ్రుతిక, భరతనాట్యం కళాకారిణి, లేబర్‌ కాలనీ, వరంగల్‌

ఇబ్బందులు పడుతున్నాం...

వరంగల్‌లో ప్రత్యేకంగా కళావేదిక లేక పోవడంతో దూరం వెళ్లి ప్రదర్శనలు ఇవ్వాల్సి వస్తోంది. శిక్షణ అకాడమీలు ఒకే సమయంలో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తే ఆడిటోరియం అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నాం. ఆడిటోరియం ఉంటే కళాకారులు దుస్తులు మార్చుకునేందుకు, అలంకరణ చేసుకునేందుకు ఇబ్బంది ఉండదు. –గజ్జెల రంజిత్‌,

పేరిణి అధ్యాపకుడు, వరంగల్‌

పూర్తికాలే!1
1/4

పూర్తికాలే!

పూర్తికాలే!2
2/4

పూర్తికాలే!

పూర్తికాలే!3
3/4

పూర్తికాలే!

పూర్తికాలే!4
4/4

పూర్తికాలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement