పాఠశాల సందర్శన
కాళోజీ సెంటర్: వరంగల్ నగరం ఎల్‌బీ నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మాసూమ్‌అలీని పూర్వ విద్యార్థి కేంద్ర మాజీ సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్ సందర్శంచారు. 55 సంవత్సరాల క్రితం ఈ పాఠశాల విద్యార్థి అని తన గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. తాము చదువుకునే రోజుల్లో కూర్చునేందుకు బల్లలు లేవని.. పాఠశాలకు డెస్క్ బెంచీలు అందజేసిన వన్నా ఖన్నాను అభినందించారు. హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో చర్చించి పాఠశాలకు కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పేద విద్యార్థులకు పూర్వవిద్యార్థులతో కలిసి స్కాలర్‌షిప్‌లు అందజేస్తానని తెలిపారు. తనకు తెలిసిన ఫౌండేషన్ సహాయ సహకారంతో పాఠశాల అభివృద్ధికి కృషిచేస్తానని వివరించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డాక్టర్ బీవీఎం స్వామి, ఉపాధ్యాయులు జయబాలరెడ్డి, కనకయ్య, భిక్షపతి, ఠయ్యాల శ్రీధరాచార్యులు, దేవేందర్, మోహన్, భాష్కర్, తదితరులు పాల్గొన్నారు.


