వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168 | - | Sakshi
Sakshi News home page

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168

Dec 4 2025 7:01 AM | Updated on Dec 4 2025 7:01 AM

వేయిస

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168 జీఎంహెచ్‌ ఆర్‌ఎంఓగా డాక్టర్‌ మంజుల ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలి కేయూలో నెట్‌వర్కింగ్‌ ఆధునికీకరణ

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం ఉదయం హుండీ లెక్కింపు నిర్వహించారు. 50 రోజుల హుండీ ఆదాయం రూ.4,57,768, పూజా టికెట్ల ద్వారా రూ. 7,46,400.. మొత్తం ఆదాయం రూ.12,04,168 వచ్చిందని ఈఓ ధరణికోట అనిల్‌కుమార్‌ తెలిపారు. పర్యవేక్షకుడిగా దేవాదాయశాఖ పరిశీలకుడు ప్రసాద్‌ వ్యవహరించారు. దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకుడు మణికంఠ శర్మ అవధాని, సిబ్బంది మధుకర్‌, లింగబత్తుల రామకృష్ణ, రజిత, రాజరాజేశ్వర సేవాసమితి మహిళా సభ్యులు పాల్గొన్నారు.

హన్మకొండ చౌరస్తా: హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి (జీఎంహెచ్‌) ఆర్‌ఎంఓగా డాక్టర్‌ అన్నెపాక మంజులను నియమిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఉత్తర్వులు జారీ చేసింది. హనుమకొండ జిల్లా దామెర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న మంజుల డిప్యూటీ సివిల్‌ సర్జన్‌గా పదోన్నతిపై జీఎంహెచ్‌ ఆర్‌ఎంఓగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.

ఖిలా వరంగల్‌: ఫిర్యాదుదారులతో గౌరవంగా మెదులుతూ, వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం వరంగల్‌ మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సన్నిహిత సెంటర్‌ (హాల్‌)ను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ ధారా కవిత, ఏఎస్పీ శుభం ప్రకాశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీస్‌స్టేషన్‌కు వివిధ పనులపై వచ్చే ప్రజలు, ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపాలని ఆయన ఆదేశించారు. సైబర్‌నేరాలు, రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని, రౌడీషీటర్లు, ఆకతాయిలు ఆగడాలను అరికట్టి ప్రజలకు రక్షణగా నిలవాలని సూచించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌ సీపీ సందర్శించారు. సిబ్బంది వివరాలు, పెండింగ్‌ కేసులను ప్రజలకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. పెండింగ్‌ కేసులను త్వరగా ఛేదించాలని ఆదేశించారు. అంతకు ముందుగా పోలీస్‌ సిబ్బంది ఆయనను స్వాగతిస్తూ గౌరవ వందనం సమర్పించారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ బొల్లం రమేశ్‌, ఎసైలు సుమన్‌, శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని క్యాంపస్‌ నెట్‌వర్కింగ్‌ను ఆధునికీకరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు వర్క్‌ ఆర్డర్‌ జారీచేసినట్లు కేయూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం బుధవారం తెలిపారు. కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సమక్షంలో వర్క్‌ ఆర్డర్‌పై విధివిధానాలపై సమీక్షించారు. రూసా నిధులతో విశ్వవిద్యాలయం కే హాబ్‌ స్టార్టప్స్‌, అంకుర సంస్థలను ప్రోత్సహించడం, మౌలిక వసతులు, క్యాంపస్‌లో ఇంటర్నెట్‌ సదుపాయాన్ని మెరుగుపరుస్తారు. రూసా అనుమతి పొందిన, మంజూరైన ప్రాజెక్టులు, అలాగే, ఇంజనీరింగ్‌ కళాశాలల్లో కొనాగుతున్న రీసెర్చ్‌ ప్రాజెక్టులకు అవసరమైన నెట్‌వర్క్‌ విస్తరించడం లక్ష్యంగా ఈవర్క్‌ ఆర్డర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు జారీ చేసినట్లు రామచంద్రం తెలిపారు. క్యాంపస్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థను అభివృద్ధి చేసి సామర్థ్యాన్ని పెంపొందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో రూ.1.29 కోట్లు యూనివర్సిటీ వెచ్చించనున్నట్లు రిజిస్ట్రార్‌ రామచంద్రం తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ అరవింద్‌కుమార్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వి.కిషన్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ సురేశ్‌, డివిజనల్‌ ఇంజనీర్‌ రజనీకరెడ్డి, రూసా నోడల్‌ అధికారి ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం అధిపతి బి.రమ పాల్గొన్నారు.

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,1681
1/2

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,1682
2/2

వేయిస్తంభాల ఆలయ ఆదాయం రూ.12,04,168

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement