గద్దెల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల ప్రాంగణ పునఃనిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. వరుస క్రమంలో నిర్మిస్తున్న వనదేవతల పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణ పనులను ఆదివారం సీతక్క పరిశీలించారు. నూతనంగా నిర్మించిన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజును ఈనెల 4న పూజారులు ప్రతిష్ఠించే అవకాశం ఉందని త్వరగా పనులు పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టర్‌ను అదేశించారు. గద్దెల ప్రాంగణంలో సీసీ ఫోర్లింగ్ పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్య తా ప్రమాణాలు పాటించాలని అధికారులను అదేశించారు. ఆమె వెంట జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ కల్యాణి, అధికారులు ఉన్నారు.
పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలి
పార్టీ అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం మేడారంలోని హరితహోటల్‌లో మండలంలోని ఎల్బాక గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు మొక్క రాజు, సుశీల, మడ్డి వెంకన్న, సమ్మక్క, గుండ్లపల్లి సమ్మయ్య, పాయం వెంకటరావు, శాంతమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరగా మంత్రి సీతక్క కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈసందర్భంగా సీతక్క మాట్లాడుతూ మండలంలోని ప్రతీ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అభ్యర్థుల విజయానికి కష్టపడి పని చేయాలన్నారు. గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, జాతర చైర్మన్ అరెం లచ్చుపటేల్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇర్ప సునీల్, మాజీ ఎంపీపీ ఎనగంటి రాములు, నార్లాపూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మంత్రి సీతక్క


