రెండో విడత నామినేషన్లు షురూ
హన్మకొండ అర్బన్: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రెండో విడత నామినేషన్ల ప్రకియ ఆదివారం మొదలైంది. ఇందుకు సంబంధించి జిల్లాలోని 5 మండలాల్లో ఉన్న సర్పంచ్ స్థానాలకు 69, వార్డు స్థానాలకు 1,699 నామినేషన్లు దాఖలైనట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. కాగా, ధర్మసాగర్, హసన్‌పర్తి, ఐనవోలు, వేలేరు, పరకాల మండలాల్లోని 73 గ్రామ పంచాయతీలు, 694 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్: వరంగల్ జిల్లాలో మూడు విడతలుగా 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీలకు జరిగే ఎన్నికల్లో 3,83,738 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీల్లో ప్రతీ వార్డుకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున జిల్లాలోని 2,754 వార్డుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ శనివారం పూర్తికాగా.. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. రెండో విడతలో భాగంగా డిసెంబర్ 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆదివారం సర్పంచ్ స్థానాలకు 32, వార్డు సభ్యుల స్థానాలకు 24 నామినేషన్లు దాఖలయ్యాయి.
జిల్లాలోని 5 మండలాల్లో సర్పంచ్ స్థానాలకు
69, వార్డు స్థానాలకు 1,699 దాఖలు


