నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
హసన్‌పర్తి: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మండల పరిఽధి సీతంపేట, నాగారం క్లస్టర్ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామిషన్ల స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ సందర్శించారు. ఈసందర్భంగా ఆయా క్లస్టర్‌ల్లో ఏ గ్రామాల నామినేషన్లు స్వీకరిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద ఓటరు జాబి తాను ప్రదర్శించాలని, హెల్ప్‌డెస్క్ ద్వారా అభ్యర్థులకు సమాచారాన్ని అందించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణకు తగిన కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న అధికారులు, పంచాయతీ కార్యదర్శులు గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట సీఈఓ రవి, ఎంపీడీఓ సుమణవాణి, తహసీల్దార్ కిరణ్‌కుమార్, అధికారులు ఉన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్


