మత్తు వదిలి మైదానానికి రండి
హసన్‌పర్తి: మత్తు వదిలి మైదానంలోకి రావాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపునిచ్చారు. హసన్‌పర్తి మండలం భీమారంలో అంతర్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలు ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ.. హసన్‌పర్తి ప్రాంతంలో మినీ స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులు బోయిని శశికాంత్, కాంగ్రెస్ నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, పుల్లా రవీందర్, బండి చైతన్యరెడ్డి, కనపర్తి కిరణ్, పెద్దమ్మ సురేశ్, యాదగిరి పాల్గొన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభం


