ఊరు వెలగాలని మూడెకరాలు అమ్మేశారు..
దుగ్గొండి: మండలంలోని తిమ్మంపేట గ్రామ సర్పంచ్‌గా విశిష్ట సేవలందించిన సారంపల్లి రాజిరెడ్డి 1970 నుంచి 11 ఏళ్లపాటు సర్పంచ్‌గా పనిచేశారు. ఈసమయంలో ఇంటింటికీ విద్యుత్‌ను తీసుకొచ్చేందుకు తన మూడెకరాల పొలాన్ని అమ్మేశారు. నాలుగు కిలోమీటర్ల దూరంలోని లక్నెపల్లి గ్రామం నుంచి విద్యుత్ లైన్ వేయించారు. గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని వందలాది మంది పేదల ఇళ్ల కోసం ఇచ్చారు. ఆయన మరణానంతరం 2008లో రాజిరెడ్డి విగ్రహాన్ని గ్రామ పంచాయతీ ఎదుట ప్రధాన రహదారి పక్కన గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇప్పటికీ రాజిరెడ్డి పేరు ప్రస్తావన రాగానే కరెంట్ తెచ్చిన మహానుభావుడు అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఆయనను గుర్తు చేసుకుంటారు.


