అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది
హన్మకొండ: తెలంగాణ అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కేసీఆర్ దీక్షా దివస్‌ను పురస్కరించుకుని 11 రోజుల కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ నక్కలగుట్టలోని కాళోజీ విగ్రం నుంచి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. స్తూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, చింతం సదానందం, నాయకులు సంకు నర్సింగరావు, కుసుమ లక్ష్మీనారాయణ, తాళ్లపెల్లి జనార్దన్‌గౌడ్, పులి రజినీకాంత్, నయీముద్దీన్, చల్ల వెంకటేశ్వర్‌రెడ్డి, సదాంత్, ఖలీల్, కోటేశ్వర్‌రావు, రాజు, ఎస్‌కే మహమూద్, రామ్మూర్తి, రాకేశ్‌యాదవ్, ప్రశాంత్, వినయ్, సంజీవ్, వినీల్‌రావు, శ్రీకాంత్‌చారి, నరేంద్ర, సృజన్, సందీప్ యాదవ్, శేఖర్, సారిక, దేవమ్మ, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు
దాస్యం వినయ్‌భాస్కర్


