
నకిలీ విత్తనాలు, పురుగు మందులమ్మిన వ్యక్తిపై పీడీ యాక్ట
రామన్నపేట : నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్.. పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. శాయంపేట చెందిన నూక రాజేశ్‌పై పీడీ యాక్టు నమోదు కాగా, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్ గోపి.. బుధవారం నిందితుడికి పరకాల జైలులో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నూక రాజేశ్ మరో ఆరుగురు నిందితులతో కలిసి ముఠాగా ఏర్పడి కాలం తీరిన పురుగుల మందులను ఫర్టిలైజర్ల డీలర్ల నుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతోపాటు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను రైతులకు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు ఏప్రిల్ 7వ తేదీన చిక్కారు. నిందితుడు గతంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న క్రమంలో మట్డెవాడ, సుబేదారి, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని నేరప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని పీడీయాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్టు నమోదవుతుందని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తే 77998 48333 సెల్‌నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.