
వృత్తి నైపుణ్యంతోనే విధుల్లో రాణింపు
వరంగల్ క్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సొంతం చేసుకోవాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాది కొత్తగూడెం జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భద్రాది పోలీస్ డ్యూటీ మీట్‌లో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. నేరాలు త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాసీ్త్రయంగా విశ్లేషించడానికి, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, ప్రభాకర్‌రావు, బోనాల కిషన్, జోన్‌కు చెందిన ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు ఆర్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.
ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్