
జిల్లాకు ఐదుగురు సెర్ఫ్ డీపీఎంలు
హన్మకొండ అర్బన్: గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రభుత్వం ఇటీవల నిర్వహిస్తున్న సాధారణ బదిలీల నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న నలుగురు డీపీఎం వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఐదుగురు డీపీఎం కేడర్ అధికారులు జిల్లాలో రిపోర్ట్ చేశారు. ఈ మేరకు వారు ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్‌డీఓ పీడీ మేన శ్రీనుని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఇతర జిల్లాలనుంచి రాజేంద్రప్రసాద్, దయాకర్, అనిత, సరిత, పద్మప్రియ బదిలీపై వచ్చారు. వీరిలో పద్మప్రియకు పెన్షన్ విభాగం, సరితకు ఫామ్స్, అనిత ఫైనాన్స్, దయాకర్ ఐబీ, రాజేంద్రప్రసాద్ నాన్ ఫామ్స్ విభాగాలు కేటాయిస్తూ పీడీ శ్రీను ఉత్తర్వులు ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో పనిచేసిన దాసు, అనిల్ వరంగల్‌కు, శ్రీకాంత్ మహబూబాబాద్, ప్రకాష్ జనగామ జిల్లాకు బదిలీ అయ్యారు.