
నవీన్‌కుమార్‌కు వైద్య సేవలందించాలి
● సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
గీసుకొండ: రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవీన్‌కుమార్ ఆరోగ్య స్థితిపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గ్రేటర్ వరంగల్ నగరం 36 డివిజన్ పుప్పాల గుట్టకు చెందిన నవీన్‌కుమార్ దీనస్థితిపై ఈ నెల 1వ తేదీన ‘దాతలారా ఆపన్న హస్తం అందించండి ’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే బాధితుల వివరాలు సేకరించి వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ ఓఎస్‌డీ బాధితుడి తండ్రి రత్నంతో మాట్లాడి అవసరమైన వైద్యసేవలందిస్తామని తెలిపారు. కాగా, ఈ విషయంపై కలెక్టర్‌కు ఆదేశాలు జారీ కాగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా వైద్య సేవలందిస్తామని కలెక్టర్ తెలిపారు.