
చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పూర్వ వరంగల్ సర్కిల్‌లో నిలిచిన చిరుద్యోగుల విభజన ప్రక్రియ అడుగు ముందుకు పడింది. మూడేళ్లుగా జాప్యం జరుగుతూ వస్తున్న ఆ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభకానుంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం ఆడిట్ చైర్మన్‌గా, హనుమకొండ సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కన్వీనర్‌గా, ఆరు సర్కిళ్ల ఎస్‌ఈలు సభ్యులుగా ఉన్న కమిటీ.. వాచ్‌మెన్, స్వీపర్, ఎల్‌ఎండీ పోస్టుల బైపర్‌కేషన్‌కు నిర్ణయం తీసుకుంది. వాచ్‌మెన్, స్వీపర్, ఎల్‌ఎండీలకు ఈ నెల 15 వతేదీ వరకు వారు ఎక్కడి వెళ్తారో సంసిద్ధత తెలిపేందుకు దరఖాస్తులు అందిస్తారు. పూరించిన ఆ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు స్వీకరిస్తారు. ఆగస్టులో పరిశీలించి ఉద్యోగుల విభజన పూర్తి చేస్తారు. ఈ మేరకు సీజీఎం ఆడిట్ షెడ్యూల్ ఖరారు చేశారు.
టెమ్రిస్ ఉమ్మడి జిల్లా
ఆర్‌ఎల్‌సీగా సతీశ్
న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్(ఆర్‌ఎల్‌సీ)గా హనుమకొండ(బి–1) గురుకులం ప్రిన్సి పాల్ డాక్టర్ జంగా సతీశ్ నియమితులయ్యా రు. ఈ మేరకు సెక్రటరీ షఫియుల్లా బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆర్‌ఎల్‌సీలు మూడు జిల్లాలకు ఒకరు చొప్పున పదహారు గురుకులాలను పర్యవేక్షిస్తుండగా ఉమ్మడి జిల్లాలో ఉ న్న 16 గురుకులాలను ఒక్కరే పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్‌ఎల్‌సీగా నియమితుడైన సతీశ్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు.
వరంగల్ మీదుగా
తిరుపతికి 8 వీక్లీ రైళ్లు
కాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి పుణ్యక్షేత్రానికి వరంగల్ మీదుగా జూలై 6వ తేదీ నుంచి కరీంనగర్–తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు బుధవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల సర్వీస్‌ల వివరాలు
ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతి–కరీంనగర్ (02761) వీక్లీ ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు ప్రతీ సోమవారం వచ్చి వెళ్తుంది. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్– తిరుపతి (02762) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్‌కు వచ్చి వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లిలో అప్ అండ్ డౌన్ రూట్‌లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు.

చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్

చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్