
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు.. కలెక్టరేట్‌లో బుధవారం వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానికంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. అర్హుల ఎంపికలో నిబంధనలు పాటించాలని సూచించారు.
అర్హులందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి..
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేయాలని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో కలిసి బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసి కోరారు. అదేవిధంగా భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అవినీతి జరిగిన విషయాన్ని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్