
గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలి
హన్మకొండ : నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ప్రతీ అధికారి, ఉద్యోగి వ్యక్తిగత పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా ఇచ్చిన రుణాలు కూడా లీగల్‌గా కవర్ చేసి రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని సూచించారు. ఐఆర్‌ఏసీ నిబంధనలకు లోబడి మార్చి నెలకు సంబంధంచి నిరార్ధక రుణాలుగా వర్గీకరించిన బకాయిలను రికవరీ చేయాలని ఆదేశించారు. నిరార్ధక ఆస్తులు 2 శాతానికి లోబడి టర్నోవర్ రూ.2,500 కోట్లకు చేరేలా కృషి చేయాలన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల చెల్లింపుపై వన్‌టైమ్ సెటిల్‌మెంట్ వివరించి వారి ద్వారా రుణాలు రికవరీ చేయాలని సూచించారు. నాబార్డు తనిఖీల్లో వరంగల్ డీసీసీబీ ఏ కేటగిరీ సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేతన సవరణ చేసినందు కు ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును మేనేజర్లు, ఉద్యోగులు సన్మానించారు. సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు.
టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు