
కల్వర్టు పనులు ఇంకెన్నాళ్లు?
ఇంజనీర్లు, కాంట్రాక్టర్ తీరుపై
మేయర్ అసహనం
వరంగల్ అర్బన్: రామన్నపేట పాత సుశీల్ థియేటర్ సమీపంలోని కల్వర్టు పనులు ఇంకా ఎన్నాళ్లు చేపడతారని.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మేయర్ సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి వరంగల్‌లోని పోతన జంక్షన్, బీట్ బజార్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పోతన జంక్షన్ ప్రాంతంలోని 12 మోర్ల జంక్షన్‌ను విస్తరించాలన్నారు. ఇదే ప్రాంతంలో చేతిపంపు పని చేయట్లేదని స్థానికుల ఫిర్యాదు మేరకు మరమ్మతులు చేయించాలని సూచించారు. డ్రెయిన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుతూ వర్షపు నీరు సులువుగా సాఫీగా వెళ్లేలా చర్యలు ఉండాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా లెవెల్స్ సరి చూడాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి. ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీపీఎస్‌లు ఏర్షాద్, అనిల్, డీఈ రాజ్‌కుమార్, ఏఈలు రాగి శ్రీకాంత్, హబీబ్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ రాజ్ పాల్గొన్నారు.