రాజకీయ కుట్ర

Political Conspiracy In Andhra Pradesh - Sakshi

జనతంత్రం

ఇందుమూలముగా సమస్త జనావళికి చాటింపు వేసి చేయంగల ప్రకటన ఏమనగా... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ కుట్రకు తెరలేచింది. ఈ కుట్ర ప్రజల మనోరథం మీదా, ప్రజాస్వామ్య సౌధం మీద కూడా. ఈ కుట్ర దళి తులపైనా, వారి ఆత్మగౌరవం పైనా. ఈ కుట్ర షెడ్యూల్డ్‌ జాతుల మీద, వారి జీవన వికాసం మీద కూడా. వెనుకబడిన తరగతుల మీదా, వారి అభ్యుదయం మీద కూడా ఈ కుట్ర కన్నేసింది. మహిళల మీదా, వారి సాధికారిత మీద కూడా కుట్ర జరు గుతున్నది. రైతుల మీదా, వారి శ్రేయస్సు మీద ఈ కుట్ర కుతకుత ఉడుకుతున్నది. మైనారిటీల మీదా, వారి సమానావ కాశాల మీద కూడా కుట్ర జరుగుతున్నది. ఆయా వర్గాల ప్రజ లను వారి గమ్యాలకు చేర్చే బాటలో భుజం కలిపి నడిచేందుకు అడుగేసిన ప్రస్తుత ప్రభుత్వంపైన ఒక భయంకరమైన రాజ కీయ కుట్రను అమలు చేయడం ప్రారంభమైంది.

ఇంతకూ ఈ కుట్ర వెనుక సూత్రధారి ఎవరు?.. ఈ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుంది, రెండేళ్లలో పడిపోతుందని శాపనార్థాలు ఎవరు పెడుతున్నారో... ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకోవాలని పంతం పట్టిన సూపర్‌ లిటిగెంట్‌ ఎవరో.. ఎన్నికల ఫలితాలతో దిమ్మతిరిగినా, వెంటనే తేరుకుని తన ఏజెంట్లను కేంద్ర అధికార పార్టీలోకి జొప్పించిన గడుసరి ఎవరో.. ఇంకో అడుగు ముందుకేసి తన పొలిటికల్‌ పార్ట్‌నర్‌ను, కేంద్ర పార్టీ పార్ట్‌నర్‌గా డీల్‌ చేసిన ముదురు వ్యూహకర్త ఎవరో... అదిగో అతడే ఈ కుట్రాయణం వాల్మీకి.

ఈ కుట్ర వెనుక రెండు ప్రధాన కారణాలున్నాయి. ఒకటి: పేదవర్గాల్లో పుట్టిన ప్రజలు శక్తిమంతులుగా, సంపన్నులుగా ఎదగడం ఆయనకు సమ్మతం కాదు. సమ్మతం కాదని చెప్పడా నికి ఆయన రాజకీయ జీవితంలో బలమైన సాక్ష్యాధారాలు కనిపిస్తాయి. ఈ సాక్ష్యాల్లో ఎగ్జిబిట్‌ నంబర్‌ ఒకటి : బాహాటంగా మీడియా సమావేశంలోనే ‘దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని ఈసడింపుగా మాట్లాడడం కంటే పెద్ద సాక్ష్యం ఏముంటుంది? ‘దళితులకు రాజకీయాలెందుకురా?’ అని పబ్లిక్‌ మీటింగ్‌లోనే కసురుకున్న సొంత పార్టీ ఎమ్మెల్యేను ప్రోత్సహించి మరోసారి ఎమ్మెల్యే టికెట్‌ను ఇవ్వడం, దళితులు స్నానం చేయరు, శుభ్రంగా ఉండరన్న మంత్రికి పార్లమెంట్‌ టిక్కెటివ్వడం వంటివన్నీ దళితుల పట్ల సదరు ముఖ్యనేత వైఖరికి అద్దంపట్టేవే. అందువల్లనే ఇతర పేద పిల్లలతోపాటు దళితుల పిల్లలు కూడా సర్కారు బళ్లలో ఇంగ్లిష్‌ చదువులు చదవడం తనకు నచ్చదు. ఇతర పేదలతోపాటు దళితులు కూడా చక్కని కాలనీల్లో సొంత ఇంట్లో నివాసం ఉండడం నచ్చదు. అవి సమకూర్చుతున్న ప్రభుత్వం మీద అందుకే ప్రతి పక్ష నేత కుట్రకు పాల్పడ్డారని ఆ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఎగ్జిబిట్‌ నంబర్‌ రెండు: షెడ్యూల్డ్‌ జాతుల ప్రజలు అందలా లెక్కడానికి తాను బద్ధవ్యతిరేకమని, మొన్నటి ఐదేళ్ల పాలనలోనే ఆయన నిరూపించారు. రాజ్యాంగ ధర్మంగా ఏర్పాటుచేయ వలసిన ‘గిరిజన సలహా మండలి’ని తన పదవీకాలంలో ఏర్పా టుచేయకుండా గిరిజన అభివృద్ధిని ఐదేళ్లపాటు అడ్డుకున్నారు. గిరిజనులకు మంత్రివర్గంలో చోటు కూడా ఇవ్వలేదు. తప్పని పరిస్థితుల్లో రాజకీయ అవసరాలకోసం చివరి సంవత్సరం మాత్రమే ఆ అవకాశాన్ని  కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక గిరిజన ఎమ్మెల్యేను ఉపముఖ్యమంత్రిగా కూడా ప్రకటించడంపై ఆయన కినుక వహించిన కారణంగానే ఈ ప్రభుత్వం మీద కుట్రను పన్నుతున్నారు.

ఎగ్జిబిట్‌ నంబర్‌ మూడు: వెనుకబడిన తరగతులకు చెందిన న్యాయవాదులు ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీలుగా పనికిరారు, వారిని నియమించవద్దని కొలీజియానికి స్వయంగా లేఖ రాసిన ఆయన బీసీలపై తన వైఖరేమిటో తేల్చి చెప్పారు. అటువంటి వ్యక్తి బీసీలకు యాభై రెండు కార్పొరేషన్లను ఏర్పాటుచేస్తే ఎలా సహిస్తారు. ఉపముఖ్యమంత్రి పదవినీ, అసెంబ్లీ స్పీకర్‌ పదవినీ అప్పగిస్తే ఎలా ఫీలవుతారు. కీలకమైన లోక్‌సభ స్థానాల్లో తొలి సారిగా బీసీలను గెలిపించి, రెండు రాజ్యసభ స్థానాలను ఆ వర్గా లకు కట్టబెడితే ఆయన మనో వికారం ఎలా ఉంటుంది. నామి నేటెడ్‌ పదవులతోపాటు, నామినేషన్‌ పనుల్లో కూడా బీసీలకు పెద్దపీట వేస్తే ఆయన నోట్లో ముద్ద ఎలా దిగుతుంది. అందుకే ఈ ప్రభుత్వం మీద కుట్ర పన్నినట్టు అర్థమవుతున్నది.

ఎగ్జిబిట్‌ నంబర్‌ నాలుగు: మహిళల సాధికారతపై ప్రతిపక్ష నేతకు విశ్వాసం లేదు. ఇది రాజకీయ ఆరోపణ కాదు. స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీడియా సమావేశా లలో ఆయన మాట్లాడిన మాటల ఆధారంగానే ఈ నిర్ధారణకు రావలసి వస్తున్నది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ అని ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మగపిల్లాడైతే ఎక్కువ, ఆడపిల్లయితే తక్కువ అనే పురుషాహంకార భావజాలంతో కూడిన కామెంట్‌ అది. ముఖ్య మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్‌చేయడం ఎంతమాత్రం క్షంతవ్యం కాదు. ఆయన మదిలో మాటే పెదవి దాటిందనుకోవాలి. అటువంటి వ్యక్తి అమ్మ ఒడి పథకాన్ని ఎలా జీర్ణించుకోగలడు. మహిళల పేరుతో ఇచ్చే ఇళ్ల పట్టాలను ఎలా స్వాగతించగలడు. డ్వాక్రా మహిళలకు తాను ఎగవేసిన సొమ్ము ఇప్పుడు ‘ఆసరా’గా తిరిగొస్తుంటే ఎలా నిద్రించగలడు. అందుకే ఈ ప్రభుత్వం మీద ఆయన కుట్రకు శ్రీకారం చుట్టారు. 

ఎగ్జిబిట్‌ నంబర్‌ ఐదు: మొదటినుంచి ఆయన రైతు శ్రేయ స్సుకు వ్యతిరేకి, తెలుగు రాష్ట్రాల్లో ఏ రైతును అడిగినా ఈ మాట చెబుతారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందజేయాలన్న ఆలోచనను వ్యతిరేకిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజలందరికీ గుర్తే. బషీర్‌బాగ్‌లో కళ్లజూసిన రైతుల నెత్తురు కంటే ఈ విషయంలో బలమైన సాక్ష్యం ఇంకేముంటుంది. 2014 ఎన్నికలకు ముందు రైతులపై ఉన్న 87 వేల కోట్ల రూపాయల అప్పును వడ్డీతో సహా తీర్చేస్తానని హామీ ఇచ్చి, కనీసం వడ్డీతో సమానంగా కూడా చెల్లించకుండా లక్ష కోట్లు ఎగనామం పెట్టారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలను పెట్టి రైతులకు సాయపడతామంటే ఆయనెలా అంగీకరించగలరు. పెట్టుబడి ఖర్చులకోసం అప్పులపాలవకుండా ఏటా ‘భరోసా’ కల్పిస్తుంటే చూసీచూడనట్లుగా ఎలా ఉండగలరు. ప్రభుత్వమే స్వయంగా రంగంలోకి దిగి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోకుండా చూస్తుంటే ఆయన వినోదం చూస్తారా. తప్పనిసరిగా కుట్రకు తెరతీస్తారు.

ఎగ్జిబిట్‌ నంబర్‌ ఆరు: మైనారిటీలంటే ఏమాత్రం లెక్కలేని తనం ఆయనది. మసీదులు కూల్చే పార్టీ (బీజేపీ)తో ఇక ముందు పొత్తు పెట్టుకోనని ఒక సందర్భంలో ముస్లింల ముందు ఒట్టుపెట్టుకున్నారు. మఖలో పెట్టుకున్న ఒట్టు పుబ్బలోనే గట్టున పెట్టేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం వర్గానికి మంత్రి పదవి ఇవ్వడానికి కూడా మనసొప్పలేదు. మూడు రోజుల కింద ఒక చర్చి మీద దుండగులు రాళ్లు విసిరితే మాటమాత్రంగానైనా ఖండించని తత్వం ఆయనది. అటువంటి నాయకుడు ముస్లి మ్‌కు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే, మైనారిటీల ప్రగతికి బాటలు వేసే కార్యక్రమాలను చేపడుతుంటే చూస్తూ ఊరుకో లేరు. అందుకే ఈ ప్రభుత్వం మీద కుట్ర పన్నారు.

ఎన్నికైన ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షం కుట్ర పన్నడానికి రెండో ముఖ్యకారణం రాజధాని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌. ఈ ప్రాజెక్టును రూపకల్పన చేసిన విధానాన్ని బట్టి ఇది ఫక్తు రియల్‌ ఎస్టేట్‌ వెంచరేనని నిపుణుల అభిప్రాయం. కాకపోతే, ప్రపం చంలో ఎక్కడా ఎవరూ తలపెట్టనంతటి పెద్దవెంచర్‌. భూసమీ కరణకు ముందే అస్మదీయులను రంగంలోకి దించి పెద్దఎత్తున ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపారు. భూసమీకరణ వెనుక కూడా పెద్ద ఎత్తున అస్మదీయుల పెట్టుబడులే ఉన్నాయనీ, ఎక్కువమంది రైతులు బినామీలు మాత్రమేనన్న వివరాలు బయటకు వస్తు న్నవి. ప్రభుత్వం సమీకరించిన భూమితో, ప్రభుత్వం సమ కూర్చే పెట్టుబడితో సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు రియల్‌ ఎస్టేట్‌ను అభివృద్ధి చేసి వ్యాపారం చేసుకునేలా ఒప్పందం కుదు ర్చుకున్నాయి. ఇదంతా చూస్తే సింగపూర్‌ ప్రైవేట్‌ కంపెనీలు సంపాదించే సొమ్ములో సింహభాగం ‘మూలవిరాట్టు’ హుండీ లోకే చేరుతుందని ఏమాత్రం జ్ఞానం ఉన్నవారికైనా అర్థమవు తుంది.

అధినేత–అస్మదీయులు కలిసి లక్షల కోట్లు సంపాదిం చేలా డిజైన్‌ చేసిన ప్రాజెక్టు అమరావతి. ఈ అవినీతి బాగోతాన్ని తవ్వితీసే పనిని ప్రస్తుత ప్రభుత్వం మొదలుపెట్టింది. ఆశలు పెట్టుకున్న లక్షల కోట్ల మాటేమోగానీ పెట్టుబడి పెట్టిన వేలకోట్ల సంగతేమిటన్న ఆందోళన అస్మదీయుల్లో నెలకొని ఉంది. వారికి ధైర్యం నూరిపోసేలా అధినేత ఈమధ్య ఒక బహిరంగ సందే శాన్ని పంపించారు. రెండేళ్లలోపే జమిలి ఎన్నికలు రాబోతున్నా యనీ, ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం ఓడిపోతుందనీ ఆ సందే శంలో ఆయన పేర్కొన్నారు. రెండు మూడు దశాబ్దాలకు పూర్వం రిలయన్స్‌ ఆధ్వర్యంలోని విమల్‌ టెక్స్‌టైల్స్‌ విభాగం వాణిజ్య ప్రకటనల్లో ట్రెండీగా ఉండేది. ‘ఓన్లీ విమల్‌’ అనేది వారి సూపర్‌హిట్‌ యాడ్‌ స్లోగన్‌. అప్పట్లోనే వాళ్లదే ఇంకో క్యాప్షన్‌ కూడా చాలా పాపులర్‌ అయ్యింది. ‘ఒక స్త్రీ తనను తాను అనేక భాషల్లో వ్యక్తీకరించుకుంటుంది. అందులో విమల్‌ ఒకటి’ (అ ఠీౌఝ్చn ్ఛ్ఠpట్ఛటట్ఛటజ్ఛిటట్ఛ జ జీn ఝ్చny  ్చnజu్చజ్ఛట, ఠిజీఝ్చ∙జీటౌn్ఛ ౌజ ్టజ్ఛిఝ.) అలాగే మన రాజకీయ నేత కూడా తనను తాను అనేక భాషల్లో వ్యక్తీకరించుకుంటున్నారు. ‘జమిలి’ అందులో ఒకటి. ఈ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రను ప్రారం భించామనే సారాంశాన్ని అస్మదీయులకు ఆయన ‘జమిలి’ సందేశం ద్వారా పంపించారు.

సాధారణంగా విటమిన్‌ లోపాలు ఉన్నవారికి సప్లిమెం ట్లుగా వాడేందుకు కొన్ని రకాల మాత్రల్ని సిఫారసు చేస్తుం టారు. ప్రజాబలం తక్కువ ఉన్న రాజకీయ నాయకులు కూడా కొన్నిరకాల సప్లిమెంట్లతో నెట్టుకొస్తుంటారు. మన సీనియర్‌ నేత కూడా మూడు రకాల సప్లిమెంట్లను వాడుతుంటారు. 1. ‘అనుకూల మీడియాలో గోబెల్స్‌ ప్రచారం. 2. ప్రత్యర్థుల మీద లిటిగేషన్లతో నెట్టుకురావడం. 2. అవకాశవాద పొత్తులు, ఎత్తు లతో రాజకీయం నడపడం. ప్రస్తుతం తెరలేపిన కుట్రలో కూడా ఈ మూడు ఎత్తుగడలను సమన్వయంతో అమలుచేస్తున్న తీరు కనబడుతూనే ఉన్నది. ఇటీవల అంతర్వేది పుణ్యక్షేత్రంలో దేవుని రథం దగ్ధమైన దురదృష్టకర సంఘటన జరిగింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆలయ ఈవోను సస్పెండ్‌ చేసింది. ప్రాథమిక విచారణను వెంటనే చేపట్టింది. సీబీఐ విచారణకు కూడా ఆదేశించింది. ప్రతిపక్ష నేత కూడా వేగంగా రంగంలోకి దిగి తన మూడు రకాల ఎత్తుగడలను ప్రయోగించారు. ప్రస్తుతం బీజేపీ బహిరంగ పార్ట్‌నర్‌గా ఉన్న తన రహస్య పార్ట్‌నర్‌ను కదిలించారు. గత కొంతకాలంగా మూగనోము పాటిస్తున్న ఆయన ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. మిత్రపక్షం ఒత్తిడో, వెనకబడతామన్న భయమో, లేక లబ్ధి పొందాలన్న వ్యూహమో తెలియదు కానీ బీజేపీ కూడా రంగం లోకి దిగి పోయింది. టీడీపీతో కలిసి మొత్తం మూడు పార్టీలు కలివిడిగా, విడివిడిగా ఆందోళన చేపట్టాయి.

దురదృష్టకర ఘటనలో ప్రభుత్వానికి ఏరకమైన సంబంధం లేకపోయినా, ప్రభుత్వం వేగంగా స్పందించి చర్యలు తీసుకున్నా కూడా విమర్శలు గుప్పిస్తూ, మతభావాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ఈ పార్టీలు ప్రస్తుత ప్రతిపక్ష నేత ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. 2017 అక్టోబర్‌ 19న పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని వేణుగోపాలస్వామి ఆలయంలో దేవుని రథం ఇదేమాదిరిగా దగ్ధమైంది. ఆ సమయంలో రెండు గంటలపాటు సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పార్టీల్లో ఏ ఒక్కటీ అప్పుడు మాట్లాడలేదు. విచారణ కోరలేదు. రథం పునర్నిర్మాణానికి ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదు. అంతర్వేదిలో ప్రస్తుత ప్రభుత్వం సీబీఐ విచా రణకు ఆదేశించడంతోపాటు, కోటి రూపాయల వ్యయంతో కొత్త రథాన్ని నిర్మించే పని మొదలుపెట్టింది. పుష్కరాల పేరుతో విజయవాడలో 40 గుళ్లను కూల్చివేస్తే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఆనాడు నోరెత్తలేదు. గోదావరి పుష్కరాల్లో ముఖ్య మంత్రి పబ్లిసిటీకోసం 30 మంది ప్రాణాలు పోయినా సీబీఐ విచారణకు ముందుకురాలేదు. వందలకోట్ల విలువచేసే సదా వర్తి భూములను కారుచౌకగా దేశం నేతలు దిగమింగడానికి ప్రయత్నించారు. అధినేత పేరుతో దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేసి అపవిత్రం చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆలయ మర్యా దలను మంటగలిపే ఎన్నో కార్యక్రమాలు టీడీపీ హయాంలో జరిగాయి. అప్పుడు మాట్లాడని నాయకులు, పార్టీలు ఇప్పుడు శూన్యంలోంచి మతభావాలు రెచ్చగొట్టి రాజకీయం చేసే చర్య లకు ఉపక్రమించడం హాస్యాస్పదం. ఈ ప్రాంత సంస్కృతి మీద, చరిత్ర మీద, ప్రజల చైతన్యం మీద అవగాహన ఉన్నవారెవరూ మత రాజకీయాలు నడపరు. పడమటి కొండమీద పొద్దు పొడి చినా పొడవచ్చు గాక. మత రాజకీయాలను మాత్రం ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు. 

నాలుగువైపుల నుంచీ కుట్రలకు తెరతీస్తున్న దృశ్యాలు ఇప్పుడు స్పష్టంగా  కనిపిస్తున్నాయి. ఆకాశంలో అక్కడెక్కడో కొన్ని మబ్బులు అనుమానాస్పదంగా కదులుతున్నాయి. మబ్బుల మాటున ఇంద్రజిత్తు లాంటి మాయావి ఎవరో మోహ రిస్తున్నట్టుగా వాటి కదలికలున్నాయి. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడిపై ఇంద్రజిత్తు పైచేయి సాధించింది ఇటువంటి మబ్బుల మాటు నుంచే. కానీ హనుమంతుడందించిన సంజీ వని మూలికతో లక్ష్మణుడు చెలరేగి ఇంద్రజిత్తును సంహరిం చాడు. ఇప్పుడు జన చైతన్యమే సంజీవని మూలిక. ఆ మూలిక ఉన్నంతకాలం ఇంద్రజిత్తులైనా–దేవేంద్రజిత్తులైనా, చంద్ర జిత్తు లైనా–ప్రచండజిత్తులైనా చిత్తుకాక తప్పదు.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top