ఎన్జీవోస్ అడహక్ కమిటీ ఏర్పాటు
భీమవరం(ప్రకాశం చౌక్): రాష్ట్రవ్యాప్తంగా ఏపీ ఎన్జీవోస్ అడహక్ కమిటీ ఏర్పాటులో భాగంగా బుధవారం పశ్చిమగోదావరి జిల్లా కమిటీని ఏర్పాటుచేశారు. స్థానిక త్యాగరాజ భవనంలో జరిగిన కార్యక్రమానికి ఏపీ ఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా ఉదిసి వెంకట పాండురంగారావు, కన్వీనర్‌గా పోతన సుకుమార్, ఫైనాన్స్ మెంబర్‌గా అల్లూరి శ్రీనివాస రాజు, మెంబర్లుగా ఎంఆర్‌కే రాజు, దేవాబత్తుల నాగదేవి, ఇంజేటి రమేష్, సుంకర వెంకటేష్‌ను నియమించారు. టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెనుమరెడ్డి శ్రీనివాసులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు గాతల జేమ్స్, ఎన్జీజీవో సంఘం రాష్ట్ర కార్యదర్శులు శివ ప్రసాద్, రామ్ ప్రసాద్, జెఏసి నాయకులు ఆర్‌ఎస్ హరనాథ్, రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు పాము శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దేవిరెడ్డి రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


