చందన బ్రదర్స్ 25వ వార్షికోత్సవం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలోని చందన బ్రదర్స్ వస్త్ర దుకాణం 25వ వార్షికోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులతో కళకళ లాడింది. చందన బ్రదర్స్ మేనేజర్లు ఏ.జగదీష్, ఎం.దుర్గా ప్రసాద్ మాట్లా డుతూ తమ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా రూ.2500 విలువ గల వస్త్రాల కొనుగోలు చేసిన వారికి ఒక వెండి నాణెం ఉచితంగా ఇస్తున్నామన్నారు. అలాగే రూ.1,500 విలువ గల వస్త్రాల కొనుగోలుపై ఫ్రాక్, టాప్స్, మెన్స్ టీషర్ట్స్, సూరత్ శారీ ఏదైనా ఒకటి రూ.25కే ఇస్తున్నామన్నారు. 92.5 సిల్వర్ జ్యూయలరీపై 25 శాతం తగ్గింపు ఉందని, ఇవే కాకుండా మహిళలు, పురుషులు, పిల్లల వస్త్రాలపై కూడా అనేక ఆఫర్లు ఇస్తున్నామన్నారు.
పెదవేగి: కొప్పులవారిగూడెంలో కోడి కత్తులు తయారు చేస్తున్నారన్న స్థావరంపై పెదవేగి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో బుధవారం రాత్రి దాడి చేశారు. కత్తులు తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 500 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కత్తులు తయారు చేసే రెండు యంత్రాలను కూడా సీజ్ చేశారు.


