చావనైనా చస్తాం.. తవ్వకాలు జరపనివ్వం
నెట్ బాల్ పోటీలు
శృంగవృక్షం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీలను గురువారం ప్రారంభించారు. 8లో u
గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న రైతులు
ఆగిరిపల్లి: మండలంలోని కనసానపల్లిలోని కర్రగట్టు వద్ద ఉన్న అసైన్డ్ భూమిలో గ్రావెల్ తవ్వకాలను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రావెల్ తవ్వకాలతో పంట పొలాలు నాశనం అవుతాయని కనసానపల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనసానపల్లిలోని కరగ్రట్టు వద్ద ఉన్న సర్వేనెంబర్‌లో అసైన్డ్ భూములు 252/4 లో 2.08 ఎకరాలు, సర్వే నెంబర్ 252/2లో 0.52 ఎకరాలను గుంటూరుకు చెందిన శ్రీ ఎకో మైన్స్, సుఖవాసి శ్రీనివాసరావు అనే వ్యక్తికి ప్రభుత్వం లీజుకు ఇచ్చింది. గురువారం లీజ్ అనుమతిదారులు తవ్వకాలు ప్రారంభించి గ్రావెల్‌ను లారీల్లో తరలిస్తుండగా రైతులు అడ్డుకున్నారు. కొండ చుట్టూ సుమారు రెండు వందల ఎకరాల్లో మామిడి, వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేస్తున్నామని, లారీల సంచారంతో పంట భూములు నాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రావెల్ తవ్వకాలు అనుమతి పొందిన వారు బెదిరింపులకు దిగుతున్నారని భయపడే ప్రసక్తి లేదని, ప్రభుత్వం ఇచ్చిన మైనింగ్ లీజు రద్దు చేసే వరకు పోరాడుతామని తేల్చిచెప్పారు.


