బంగారు ఆభరణం అప్పగింత | - | Sakshi
Sakshi News home page

బంగారు ఆభరణం అప్పగింత

Nov 26 2025 6:43 AM | Updated on Nov 26 2025 6:43 AM

బంగారు ఆభరణం అప్పగింత

బంగారు ఆభరణం అప్పగింత

బంగారు ఆభరణం అప్పగింత

ద్వారకాతిరుమల: స్థానిక యూటీఎఫ్‌ భవనంలో ఓ పెళ్లి బృందం మరిచిపోయిన బంగారు ఆభరణాన్ని మంగళవారం ఆ కుటుంబానికి అప్పగించారు. యూటీఎఫ్‌ భవనంలో సోమవారం ఓ వివాహం జరిగింది. వరుడి తరుఫు బంధువులు బంగారు ఆభరణాన్ని గదిలో మరచిపోయి వెళ్లిపోయారు. భవన నిర్వహణను చూసుకుంటున్న వీసం నాగేశ్వరరావు (యూటీఎఫ్‌ నాగు)కి ఈ ఆభరణం కనిపించింది. దాంతో విషయాన్ని బాధిత కుటుంబానికి తెలియజేశారు. యూటీఎఫ్‌ జిల్లా నాయకులు రవికుమార్‌, మస్తుఫాలీ, ఎంఈఓలు సత్యనారాయణ, వెంకటరావు బాధిత కుటుంబానికి ఈ ఆభరణాన్ని అందజేశారు. నాగు నిజాయతీని మెచ్చుకుని, అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement