నూజివీడు: పట్టణంలోని త్రివిధ హైస్కూల్ విద్యార్థి నాగళ్ల వివేక్ స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్(ఎస్‌జీఎఫ్) జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సబ్బినేని శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఇటీవల కర్నూల్‌లో నిర్వహించిన ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని వివేక్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడన్నారు. ఈ సందర్భంగా వివేక్‌ను ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.
ముదినేపల్లి రూరల్: అల్లూరు హైస్కూల్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని వి ప్రమోదిని జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయుడు శొంఠి రామోజీ తెలిపారు. ఇటీవల మచిలీపట్నం నోబుల్ కళాశాలలో జరిగిన అండర్–14 ఉమ్మడి కృష్ణాజిల్లా బాలికల విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రమోదినిని ఎస్‌ఎంసీ చైర్మన్ ఎస్ వెంకటశ్యామల, కమిటీ సభ్యులు దావు నాగరాజు, వి రత్నకామేశ్వరరావు, హెచ్‌ఎం. ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక


