నేత్రపర్వం.. ధ్వజారోహణం | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వం.. ధ్వజారోహణం

Nov 25 2025 10:20 AM | Updated on Nov 25 2025 10:20 AM

నేత్ర

నేత్రపర్వం.. ధ్వజారోహణం

నేత్రపర్వం.. ధ్వజారోహణం సైక్లింగ్‌లో సత్తా చాటిన స్నేహిత

ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం రాత్రి ఆలయంలో ధ్వజారోహణ వేడుక నేత్రపర్వంగా జరిగింది. ముందుగా అర్చకులు, పండితులు గర్భాలయంలో కొలువైన స్వామికి విశేష అభిషేకాలను నిర్వహించారు. అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. ఆ తరువాత ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల కల్యాణ మూర్తులను ఉంచి గణపతి పూజ, పుణ్యహవాచనం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపనను నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణ వేడుకను అట్టహాసంగా నిర్వహించారు.

పెదపాడు: ఎన్టీఆర్‌ జిల్లా నున్నలో జరిగిన ఆంధ్ర రాష్ట్ర స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌న్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) సైక్లింగ్‌ ట్రాక్‌ ఈవెంట్‌లో ఏలూరుకు చెందిన జీ స్నేహిత ద్వితీయస్థానం సాఽధించింది. దీంతో జార్ఖండ్‌లోని రాంచిలో జనవరి 13న జరిగే పోటీలకు ఎంపికై ంది.

నేత్రపర్వం.. ధ్వజారోహణం 
1
1/1

నేత్రపర్వం.. ధ్వజారోహణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement