
9 నుంచి ‘నన్నయ’లో సెమినార్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ఈ నెల 9,10 తేదీలలో ఇంటర్నేషనల్ సెమినార్ జరుగనుంది. తాడేపల్లిగూడెం క్యాంపస్‌లోని కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ‘రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆర్గానిక్ అనలిటికల్ అండ్ ఫార్మాస్యూటికల్ డెవలప్‌మెంట్’ అనే అంశంపై జరిగే ఈ సెమినార్‌కి సంబంధించిన బ్రోచర్‌ను వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ గురువారం విడుదల చేశారు. ఈ సెమినార్‌లో స్పీకర్స్‌గా ప్రొఫెసర్ కేవీ రామానుజాచారి (యుఎస్‌ఏ), సైంటిస్టు డాక్టర్ ఎన్.నాగన్న (చైనా), ప్రొఫెసర్ పి.నాగేశ్వరరావు (వరంగల్), డాక్టర్ రాంబాబురెడ్డి (ఐఐటీ – ఖరగ్‌పూర్) పాల్గొంటారన్నారు. దీనికి కన్వీనర్‌గా డాక్టర్ బి. జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహరిస్తారు.