సెక్టార్‌ సమావేశాలకు డుమ్మా ! | - | Sakshi
Sakshi News home page

సెక్టార్‌ సమావేశాలకు డుమ్మా !

Mar 11 2025 12:06 AM | Updated on Mar 11 2025 12:06 AM

సెక్టార్‌ సమావేశాలకు డుమ్మా !

సెక్టార్‌ సమావేశాలకు డుమ్మా !

ఆలమూరు: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సీఐటీయూ పిలుపు మేరకు అంగన్‌వాడీలు తలపెట్టిన ధర్నాను నిలువరించేందుకు ఐసీడీఎస్‌ అధికారులు సోమవారం మండల కేంద్రాల్లో సెక్టార్‌ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ సమావేశాలకు ఒక్క అంగన్‌వాడీ కార్యకర్త కూడా హాజరు కాలేదు. అంగన్‌వాడీ సహాయకులు కేంద్రాలను తెరవకుండా మూకుమ్మడి సెలవును ప్రకటించారు. దీంతో జిల్లాలోని ఆయా మండలాల్లో ఏర్పాటు చేసిన సెక్టార్‌ సమావేశాలకు అంగన్‌వాడీలు హాజరుకాకపోవడంతో ఐసీడీఎస్‌ అధికారులు మధ్యాహ్నం వరకూ ఎదురుచూసి వెనుదిరిగారు. నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనేక మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఇప్పటికే విజయవాడ చేరుకోగా, కొంతమందిని మహిళా పోలీసుల సాయంతో ఇంటి వద్దే నిలువరించారు. మరికొంత మందిని మర్గం మధ్యలో అడ్డుకుని, వెనక్కు పంపేశారని అంగన్‌వాడీలు చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఆశించినట్టుగా అంగన్‌వాడీల ఉద్యమాన్ని అణచివేయలేకపోయామనే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

ఆందోళనకే మొగ్గుచూపిన అంగన్‌వాడీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement