‘పల్లె’వించిన ప్రగతి | Sakshi
Sakshi News home page

‘పల్లె’వించిన ప్రగతి

Published Fri, May 10 2024 1:30 PM

‘పల్ల

ఉప్పలగుప్తం: డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధి సూదాపాలెంలో నిర్మించిన ప్రభుత్వ భవనాలు ఒకేచోట కనివిందు చేస్తున్నాయి. ప్రతీ 2 వేల మంది జనాభాకు చేరువగా, ఎటువంటి ఇబ్బందులకు తావు లేకుండా సేవలు అందించాలనే దృక్పథంతో ఈ భవనాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మాణాలు చేపట్టిన రైతుభరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌లతో భవనాలు ఒకేచోట రావటంతో గ్రామం కొత్తకళను సంతరించుకుంది. రూ.54 లక్షల వ్యయంతో నాడు – నేడుతో అభివృద్ధి చేసిన జెడ్పీ ఉన్నత పాఠశాల, గ్రామ సచివాలయం–1 పరిధిలో రూ.1.30 కోట్లతో, సచివాలయం–2 పరిధిలో రూ.56 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లతో గ్రామాల్లో ఎన్నడూలేని విధంగా అభివృద్ధి కనిపిస్తోంది. రూ.43.60 లక్షలతో సచివాలయ భవనం, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, రూ.20.80 లక్షలతో వైఎస్సార్‌ విలేజ్‌ క్లీనిక్‌లను నిర్మించారు. దీంతో గతంలో మాదిరిగా మండల కేంద్రానికి వెళ్లవలసిన అవసరం లేకుండా ప్రజలు సమస్యలు, అవసరాలు గ్రామంలోనే తీరుతున్నాయి. పైగా ప్రభుత్వ భవనాలన్నీ తమ గ్రామంలో ఒకే చోట ఉండటంతో కొత్త అందం కనిపిస్తోందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

‘పల్లె’వించిన ప్రగతి
1/2

‘పల్లె’వించిన ప్రగతి

‘పల్లె’వించిన ప్రగతి
2/2

‘పల్లె’వించిన ప్రగతి

Advertisement
 
Advertisement