
ట్రయంఫ్ మోటార్‌సైకిల్ కంపెనీ.. స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైకును లాంచ్ చేసింది. దీని ధర రూ. 23.07 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది లిమిటెడ్ ఎడిషన్ రూపంలో.. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1200 యూనిట్లకు మాత్రమే పరిమితం. దీనిని 1200 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు. అయితే భారతదేశానికి ఎన్ని యూనిట్లను కేటాయించిందో వెల్లడించలేదు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆవిష్కరించబడిన స్పీడ్ ట్రిపుల్ 1200 RX.. ఇప్పటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దీనిని స్పీడ్ ట్రిపుల్ 1200 RS ఆధారంగా రూపొందించారు. అయితే ఇది లేటెస్ట్ అప్‌గ్రేడ్‌లను పొందుతుంది. ఇది లేత పసుపు, నలుపు రంగుల కలయికతో చూడచక్కగా ఉంది.
ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!
కొత్త ట్రయంఫ్ స్పీడ్ ట్రిపుల్ 1200 RX బైక్.. 1,163 సీసీ ఇన్‌లైన్ త్రీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 10750 ఆర్పీఎం వద్ద 183 హార్స్ పవర్, 8750 ఆర్పీఎం వద్ద 128 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.