ఏకగ్రీవాలకు మొగ్గు
చుంచుపల్లి: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో పలు గ్రామాలు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపాయి. మొత్తం 159 జీపీలకు, 1,436 వార్డులకు నామినేషన్లు స్వీకరించారు. ఉపసంహరణ గడువు బుధవారం ముగియగా, రాత్రి 11:30 గంటల వరకు అందింన సమాచారం ప్రకారం 14 పంచాయతీలు, 344 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. అధికారిక ప్రకటన విడుదలయ్యాక ఒకటి, రెండు మార్పులు జరిగే అవకాశం ఉంది.
● కరకగూడెం మండలంలో 16 గ్రామ పంచాయతీల్లో 45 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. 130 వార్డులు ఉండగా, 12 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 118 వార్డులకు 264 మంది పోటీలో ఉన్నారు.
● మణుగూరు మండలంలో 14 పంచాయతీల్లో 42 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 132 వార్డులు ఉండగా, 9 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 123 వార్డుల్లో 348 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
● అశ్వాపురం మండలంలో 24 పంచాయతీల్లో సండ్రాలబోడు గ్రామపంచాయతీ ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 23 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 65 మంది బరిలో ఉన్నారు. ఇక 214 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా, మిగిలిన 184 వార్డులకు 394 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
● భద్రాచలం మండలంలో ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి 11 నామినేషన్లు, 20 వార్డు స్థానాలకు 98 దాఖలయ్యాయి. ఉపసంహరణల అనంతరం సర్పంచ్‌కు ఐదుగరు బరిలో ఉండగా, 20 వార్డు స్థానాలకు 75 మంది బరిలో నిలిచారు.
● పినపాక మండలంలో 23 పంచాయతీల్లో మూడు జీపీలు కిష్టాపురం, జగ్గారం, పాతరెడ్డిపాలెం గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. 20 పంచాయతీలకు మాత్రమే ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి. ఇక 202 వార్డులు ఉండగా, 26 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 176 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తారు.
● చర్ల మండలంలో 26 పంచాయతీలకు 134 నామినేషన్లు రాగా, ఉపసంహరణ అనంతరం 97 మంది బరిలో నిలిచారు. 232 వార్డులకు 479 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 78 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ఉపసంహరణ, తిరస్కరణ తర్వాత 345 మంది బరిలో నిలిచారు.
తొలి విడత సర్పంచ్, వార్డు ఎన్నికల్లో నిలిచే అభ్యర్థుల వివరాలు తేలాయి. సర్పంచ్, వార్డు సభ్యులకు వేర్వేరుగా గుర్తులను కూడా కేటాయించారు. ప్రచారం చేసుకునేందుకు వారం రోజులు సమయం ఉంది. అభ్యర్థులు కచ్చితంగా ఎన్నికల నియమావళి పాటించాలి. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దు. –సుధీర్, డీపీఓ
బూర్గంపాడు మండలంలో 18 పంచాయతీల్లో లక్ష్మీపురం, మోరంపల్లి బంజర, పినపాకపట్టీనగర్, నకిరపేట, కృష్ణసాగర్ 5 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 13 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఇక 182 వార్డులకు, 57 ఏకగ్రీవం కాగా, మిగిలిన 125 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
దుమ్ముగూడెం మండలంలో 37 సర్పంచ్ స్థానాలకు దుమ్ముగూడెం, గంగోలు, కొత్తూరు, కోయ నర్సాపురం, పెద్ద కమలాపురం 5 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 32 స్థానాలకు 105 మంది బరిలో నిలిచారు. 324 వార్డులకు 142 వార్డులు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 182 వార్డులకు 501 మంది బరిలో ఉన్నారు.
ఏకగ్రీవాలకు మొగ్గు


