
మురికి కంపు
● పట్టణాల్లో డంపింగ్ యార్డ్‌ల నిర్వహణ అస్తవ్యస్తం ● పలుచోట్ల రోడ్డుపైనే పడేస్తున్న సిబ్బంది ● వాసన, పొగ భరించలేక సమీప ప్రజలు అవస్థలు
చెత్త
డంపు..
పట్టణాల్లో చెత్త సేకరణ, డంప్ చేయడం ప్రహసనంలా మారింది. చాలా చోట్ల డంపింగ్ యార్డులు ఉన్నా అవి సరిపోక చెత్తను రోడ్లపైనే పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు. అటుగా వెళ్లే వారు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెత్త రీసైక్లింగ్ చేస్తే ఈ సమస్య కొంత పరిష్కార మయ్యే అవకాశ ం ఉన్నా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, అశ్వారావుపేట, ఇల్లెందులో డంపింగ్ యార్డుల సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్..